
అంగన్వాడి టీచర్లను రెగ్యులరైజ్ చేయాలని ఆదివారం మోకాళ్లపై నిలబడి నిరసన తెలియజేశారు. జక్రాన్ పల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు అంగన్వాడి టీచర్లు ఆయాలు చేపట్టిన సమ్మె ఆదివారం ఏడవ రోజుకు చేరుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడి టీచర్లు ఆయాలు మోకాళ్ళ పై నిలబడి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్లు మాట్లాడుతూ తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కనీస వేతనం 26,000 చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమకు కూడా పెన్షన్ వర్తింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమకు గ్రాట్యుటీ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల అంగన్వాడి టీచర్లు ఆశా వర్కర్లు 100 మంది వరకు పాల్గొన్నారు.