వర్థంతి కార్యక్రమంలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎం కోటేశ్వరరావు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో మాజీ సభ్యులు కొరటాల సత్యనారాయణ నిత్య అధ్యయన శీలి అని ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎం. కోటేశ్వరరావు అన్నారు. ప్రజా సమస్యలను సామాజిక, ఆర్థిక కోణంలో విశ్లేషించి ఉద్యమాలు నడిపిన నాయకుడని గుర్తు చేశారు. ఆయన ఏ బాధ్యతల్లో ఉన్నప్పటికీ కార్యకర్తలను ఏరా బాబూ…అంటూ ఎంతో అప్యాయంగా భుజం తట్టేవారని తెలిపారు. నాయకులను, కార్యకర్తలను తన స్నేహితుల్లా పలకరించేవారని చెప్పారు. ప్రజాశక్తిని ప్రజల పత్రికగా రూపొందించడంలో ఆయన కృషి ఎనలేనిది అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంహెచ్ భవన్‌లో నవతెలంగాణ దినపత్రిక ఆధ్వర్యంలో కొరటాల సత్యనారాయణ 20వ వర్థంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. నవతెలంగాణ జీఎం ఎం. రఘు అధ్యక్షత వహించారు. సీజీఎం పి ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేష్, నవతెలంగాణ బుక్ హౌజ్ ఎడిటర్ కె ఆనందాచారి, కోటేశ్వరరావు కొరటాల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ చివరి వరకు కొరటాల ధ్యాస అధ్యయనంపైన్నే ఉండేదని చెప్పారు. అలాంటి నాయకులతో మాట్లాడం ద్వారా మనకు విజ్ఞానం పెరుగుతుందని తెలిపారు.
ప్రజాప్రతినిధిగా ఆయన రాష్ట్ర వ్యాప్త సమస్యలపై గళమెత్తేవారని గుర్తు చేశారు. ధనిక రైతు కుటుంబంలో పుట్టిన ఆయన కమ్యూనిస్టుగా మారి శ్రామిక సమస్యలపై పోరాడారని తెలిపారు. సామాజిక సమస్యలపై కేంద్రికరించి వాటిపై పట్టు సాధించారని గుర్తు చేశారు.ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, రైతు, చేనేత కార్మికుల సమస్యలపై అన్ని తానై పని చేశారని కొనియాడారు. కేవీపీఎస్ ఆవిర్భవించడంలో కీలకపాత్ర పోషించారని తెలిపారు. కులవిక్షత, అంటరానితనానికి వ్యతిరేకంగా సీపీఐ(ఎం) ఉధృతంగా పోరాటాలు నిర్వహించిందని గుర్తు చేశారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలంటూ కొరటాల చెప్పేవారని గుర్తు చేశారు. వినమ్రతకు ఆయన మారుపేరుగా నిలిచారని చెప్పారు. ఏ దేశ న్యాయ వ్యవస్థ అయినా ఆ దేశ పాలకవర్గాలకు అనుగుణంగా ఉంటుందని అమెరికా సుప్రీం కోర్టు తీర్పులపై అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అమెరికా విధానాలను సమర్థిస్తున్న భారత్ పునరాలోచించుకోవాలని కోరారు. పాలకుల నిర్ణయాలను కోర్టులు ఆపలేవనీ, వాటి అమల్లో వస్తున్న లోపాలను మాత్రమే ప్రశ్నిస్తాయన్నారు. బాబ్రీమసీదు కూల్చి అనంతరం దేశ ప్రజల మనోభావాలకనుగుణంగా సుప్రీంకోర్టు అయోధ్య దేవాలయ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు.
కొరటాల నిత్య అధ్యయనశీలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



