కేటీఆర్ పచ్చి అబద్ధాల మంత్రి…

గ్యారంటీ పథకాల అంబాసిడర్ గా డ్రామారావు..
– కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేకే మహేందర్ రెడ్డి

నవతెలంగాణ-తంగళ్ళపల్లి : కేటీఆర్ పచ్చి అబద్దాల మంత్రి అని, టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలకు డ్రామారావు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేకే మహేందర్ రెడ్డి ఆరోపించారు. మండలంలోని జిల్లెల్ల గ్రామంలో శుక్రవారం మండల పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ కుమార్ అద్వర్యం లో కాంగ్రెస్ పార్టీ జెండాను కేకే మహేందర్ రెడ్డి ఎగురవేశారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్ర౦లో ఆ నలుగురి దోపిడీ జరుగుతుందన్నారు.ప్రతి గ్రామం లో స్థానికంగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు నలుగురు దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అనంతరం గ్రామ ప్రజలకు,కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ఆరు గ్యారంటీలను ఇంటి ప్రచారం చేస్తూ, అందరిని కలుస్తూ వివరించారు.ఈకార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల కాంగ్రెస్ కమిటీ నాయకులు,జిల్లెళ్ల గ్రామ శాఖ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

Spread the love