కేటీఆర్‌ కు మతి తప్పింది…

– డాక్టర్‌ మల్లు రవి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మతి స్థిమితం కోల్పోయారని డాక్టర్‌ మల్లు రవి ఎద్దేవా చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ముందు రేవంత్‌ రెడ్డిని సీఎంగా ప్రకటిస్తే కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా రాకపోయేవంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన దురహంకారానికి పరాకాష్ట అని విమర్శించారు. ముందే సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఉంటే బీఆర్‌ఎస్‌కు 3 సీట్లు రాకపోయేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పార్టీ కుటుంబ పార్టీ కానీ, ఎన్నికల తర్వాత గెలిచిన వారితో సీఎల్పీ నేతను ఎన్నుకుంటారని గుర్తుచేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు రాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే రెండు గ్యారంటీలను అమలు చేసిందనీ, మరో రెండు గ్యారంటీలను మంగళవారం నుంచి అమలు చేయబోతున్నట్టు తెలిపారు.

Spread the love