7న నగరానికి కేటీఆర్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ తిరిగి హైదరాబాద్‌కు రావటానికి ఇంకా రెండు మూడు రోజుల సమయం పడుతుందా..? అంటే అవుననే సమాధానమే ఆ పార్టీ వర్గాల నుంచి వస్తున్నది. బీఆర్‌ఎస్‌ తొలి జాబితా నేపథ్యంలో.. అలకలు, అసంతృప్తులకు దూరంగా ఉండేందుకే ఆయన గత నెల 19న అమెరికా ఫ్లయిటెక్కిన విషయం విదితమే. దీంతోపాటు పలు అధికారిక, కుటుంబ పనుల నిమిత్తం మంత్రి ఆ దేశంలో పర్యటించారు. ఈ క్రమంలో షెడ్యూల్‌ ప్రకారం ఆయన ఈనెల ఒకటిన హైదరాబాద్‌కు తిరిగి రావాల్సి ఉంది. కానీ రాలేదు. దీంతో రెండో తేదీన కేటీఆర్‌ తిరుగు ప్రయాణమవు తారనే వార్తలొచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఆయన బుధవారం రాత్రికి విమానమెక్కి..గురువారం ఉదయాని(ఈనెల7)కి హైదరాబాద్‌లో దిగనున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి టిక్కెట్లు ఆశించిన ఆయన సన్నిహితులు, స్నేహితులు మంత్రి రాక కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

Spread the love