చొప్పదండి ఎమ్మెల్యేకు కేటీఆర్‌ పరామర్శ

చొప్పదండి ఎమ్మెల్యేకు కేటీఆర్‌ పరామర్శనవతెలంగాణ-ఆల్వాల్‌
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఎమ్మెల్యే కేటీఆర్‌ పరామర్శించారు. ఇటీవల సత్యం సతీమణి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌ బుధవారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌లోని ఎమ్మెల్యే సత్యం నివాసానికి వెళ్లారు. సత్యం భార్య రూపాదేవి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యేను ఓదార్చారు. కేటీఆర్‌ వెంట కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే వివేక్‌, హుజురాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌, పార్టీ సీనియర్‌ నాయకులు ఉన్నారు.

Spread the love