తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్, బిజెపి పార్టీ ప్రజలకు ఓరగాపెట్టింది ఏమీ లేదని కాంగ్రెస్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి కుచన రవళి రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కరుణాపురం గ్రామంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ టి పి సి సి ప్రధాన కార్యదర్శి సింగపురం ఇందిరా ఆదేశాల మేరకు పెద్ద పెండ్యాల కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొత్తపెళ్లి బిక్షపతి. ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూచన రవళి రెడ్డి పాల్గొని మాట్లాడారు.తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సుఖాలు అనుభవిస్తున్నది బీఆర్ఎస్ పార్టీఅని మండిపడ్డారు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని ఆ వేధన వ్యక్తం చేశారు. తొమ్మిది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న కేసీఆర్,ప్రజలను మసిబూసి మారేడు కాయ చేసి మోసం చేశారని అన్నారు. 2009 సంవత్సరం నుండి ఎమ్మెల్యేగా రాజయ్య స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలకు ఒరగబెట్టింది ఏం లేదని, కడియం శ్రీహరి,రాజయ్య ఇద్దరు కలిసి రహస్య ఒప్పందాలు చేసుకొని బయటికి మాత్రం విభేదాలు ఉన్నట్లు ప్రజలను మోసం చేస్తు మభ్యపెడుతున్నారని అన్నారు. వీరిద్దరూ తోడు దొంగలేనని వీరి మాటలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో శ్రీహరి రాజయ్యలకు స్టేషన్ ఘన్పూర్ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఆ సందర్భంగా తెలిపారు. స్త్రీల మీద గౌరవం లేని రాజయ్య మీద,టిడిపి పాలనలో మంత్రిగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్లు చేయించినావని శ్రీహరి మీద ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ నటన రాజకీయాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి మోసపు మాటలతో ప్రజలు మరువక ముందే కడియం శ్రీహరి, రాజయ్య తో కలిసి మీడియాకు ఫోటోలుకు ఫోజులు ఇచ్చిన సంగతి గుర్తు చేశారు. వీరిని స్టేషన్ ఘన్పూర్ ప్రజలు రాబోయే ఎలక్షన్లలో చిత్తుగా ఓడిస్తున్నదన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి బహుమానంగా తెలంగాణ రాష్ట్రంలో 90 సీట్లు గెలిచి,ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బిసి సెల్ అధ్యక్షుడు పెసర వెంకటేష్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు భైరపాక దివాకర్, పెద్ద పెండ్యాల ఇందిరక్క యువసేన పొదుపు సంఘం అధ్యక్షుడు గంటే రాజ్ కుమార్, ధర్మాపురం గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీను సాయి పేట,జోగల రాజేందర్, కరుణాపురం గ్రామ శాఖ అధ్యక్షుడు సికరాజు,తాటికాయల గ్రామ శాఖ అధ్యక్షుడు,సారయ్య,కరుణాపురం యూత్ సభ్యులు శశి కుమార్,హరీష్,వంశీ,సుధాకర్. భరత్,సందీప్,కిషన్,గణేష్ తదితరులు పాల్గొనడం జరిగినది.