గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన కుంభం

నవతెలంగాణ – భువనగిరి రూరల్ 

భువనగిరి పట్టణం అర్బన్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలలోని  గ్రుహజ్యోతి (200మూనిట్ల ఉచిత కరెంట్),  మహాలక్ష్మీ గ్యాస్ పథకాలను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ పథకాలను విడుదలవారీగా అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు కూర వెంకటేష్ , కౌన్సిలర్లు జిట్ట వేణుగోపాల్, కైరంకోండ వెంకటెష్, సాలాఉద్దిన్, పట్టణ నాయకులు అనీల్ పొలిశెట్టి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేష్,మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణా రెడ్డి,  బీసుకుంట్ల సత్యనారాయణ, అవీస్,మజర్ లు పాల్గొన్నారు.
Spread the love