భూ సంస్కరణలు అమలు చేయాలి..!

– సామాజిక పరివర్తన బృందం డిమాండ్
నవతెలంగాణ- దుబ్బాక రూరల్ 
రాష్ట్రంలో భూ సంస్కరణలను అమలు చేసి భూమి లేని నిరుపేదలకు భూ పంపిణి చేయాలని సామాజిక పరివర్తన బృందం నేతలు డాక్టర్ కుమార్,పి.శంకర్ డిమాండ్ చేశారు. గురువారం డిబిఎఫ్, రాష్ట్రీయ మూల్ నివాస్ సంఘ్ ల ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర ఐదవ రోజు  ఎనగుర్తి, బొప్పాపూర్, అకారం,రఘొత్తంపల్లి వరకు చేరుకుంది. ఈ సందర్భంగా పి.శంకర్ మాట్లాడుతూ పేదలకు భూపంపణి చేయకుండా, భూసంస్కరణలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.దళితులకు మూడ ఎకరాల భూమి పధకాన్ని అమలు చెయకుండా ప్రభుత్వం భూములను వంద కొట్లకు ఎకరాకు అమ్ముకొవడమే అభివృద్ధి అనడం తగద న్నారు.వ్వవసాయ మీద అధారపడి జీవిస్తున్న రాష్ట్రంలో తొమ్మిది లక్షల దళిత కుటుంబాలకు భూమి లేక కూలీలుగా బతకాల్సిన దాపురించిందన్నారు.పహణిలో తోలగించిన అనుభవదారు కాలాన్ని తిరిగి కొనసాగించి భూమి పై హక్కులు కల్పించాలన్నారు. ఉపాధి  హామీ పథకాన్ని ఎత్తివేతకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ఉపసంహరించుకొవాలన్నారు. తదనంతరం డాక్టర్ కుమార్ మాట్లాడుతూ తరతరాలుగా కొనసాగుతున్న అంటరానితనానికి కారణమైన కుల వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం చర్యలు తీసుకొవాలన్నారు. డాక్టర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగ హక్కుల పై అవగాహన పెంపొందించుకొవాలన్నారు.యవత చదువు తో పాటు చరిత్ర ను అధ్యయనం చేయాలన్నారు. బిసి కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు.ఎనగుర్తి,అకారం గామాలలోని పాఠశాలను సందర్శించి సమస్యలను  తెలుసుకున్నామన్నారు.పాఠ్యాంశాలను బోధించే ఉపాధ్యాయుులు లేకపోవడంతో పాఠశాలల్లో విద్యార్ధుల సంఖ్య తగ్గుతున్నారని ఈ పాదయాత్ర బృందం గుర్తించిందని పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేక విద్యార్ధులు ఇబ్బందుల పావుతున్నారు.పాఠశాలలో మౌళిక సదుపాయాలు కల్పించాలన్నారు .ఆకారం ఉన్నత పాఠశాలలో భారత రాజ్యంగ పిఠిక పై ప్రతిజ్ఞ చేయించారు.ఈ పాదయాత్ర లో అర్ యంఎస్ నేత సురేందర్ సింగ్,,డిబిఎఫ్ నాయకులు దుబాషి సంజివ్, దాసరి ఎగొండ స్వామి, బ్యాగరి వేణు , ఎనగుర్తి సర్పంచ్ గుండా శంకర్,బొప్పాపూర్ సర్పంచ్ ,అకారం సర్పంచ్ నాగభూషణం, అంబేద్కర్ సంఘం నాయకులు కమటం వెంకటస్వామి, పాటల మల్లన్న,మెట్ల బాబు, స్వామి,రాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love