ఒడిశ్సీ ఓఎల్ఈడీ జీ9 గేమింగ్ మానిటర్స్ ప్రారంభోత్సవం

– ఫ్రీ సింక్, ఏఎండీ ఫ్రీ సింక్ ప్రీమియం ప్రో, గేమింగ్ హబ్, స్టెల్లార్ రిఫ్రెష్ రేట్ ఉత్తమమైన గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది
– ప్రపంచంలో మొదటి డ్యూయల్ క్యూహెచ్ డీ ఓఎల్ఈడీ స్క్రీన్ పేరును ఆనందిస్తోంది
– నియో క్వాంటమ్ ప్రాసెసర్ ప్రో అత్యంత ఆధునిక గేమింగ్ మరియు సినిమా వంటి అనుభవాన్ని అందిస్తోంది
– శామ్ సంగ్ స్మార్ట్ టీవీ, ఎల్ఓటీ హబ్, మరియు వాయిస్ సహాయంతో నిజమైన సినీమా వంటి దృశ్యాలను అనుభవించండి
నవతెలంగాణ- గురుగ్రామ్: భారతదేశంలో అతి పెద్ద ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శామ్ సంగ్, ఈ రోజు 2023 శ్రేణి ఒడిశ్సీ జీ9 ఓఎల్ఈడీ గేమింగ్ మానిటర్స్ ను ఆరంభించింది. నియో క్వాంటమ్ ప్రాసెసర్ దీనికి మద్దతు చేస్తోంది. ఒడిశ్సీ జీ9 డిస్ ప్లే హెచ్ డీఆర్ ట్రూ బ్లాక్ 400తో పవర్ తో పని చేసే గేమింగ్ మానిటర్. అనుకూలమైన పిక్చర్ నాణ్యత కోసం ప్రతి దృశ్యపరమైన వివరాన్ని పెంచే తరువాత స్థాయి ఏఐ ఉన్నత టెక్నాలజీతో, మానిటర్స్ ఉన్నతమైన 240 Hz రిఫ్రెష్ రేట్ మరియు 0.03 ప్రతిస్పందన సమయంతో ప్రత్యర్థులను నిర్వహించే భారీ 1800 ఆర్ కర్వేచర్ ను ప్రదర్శిస్తాయి. 49 అంగుళాల సైజ్ లో 1800 ఆర్ కర్వేచర్ తో, ఒడిస్సీ ఓఎల్ఈడీ జీ9 32:9 నిష్పత్తితో డ్యూయల్ క్వాడ్ హై డెఫినిషన్ (డీక్యూహెచ్ డీ;5,120 x 1,440) రిజల్యూషన్ ను అందించే మొదటి ఓఎల్ఈడీ మానిటర్. పెద్ద మరియు విశాలమైన స్క్రీన్ నిష్పత్తి సూపర్-అల్ట్రా వైడ్ దృశ్యాలలో యూజర్స్ లీనమయ్యేలా చేస్తుంది – ఇది రెండు క్యూహెచ్ డీ స్క్రీన్స్ ను ఒక దాని పక్కన మరొకటి పెట్టిన దానికి సమానం. దీని వేగవంతమైన 0.03ఎంఎస్ గ్రే టు గ్రే (జీటీజీ) ప్రతిస్పందన సమయం మరియు 240 Hz రిఫ్రెష్ రేట్ ప్లేయర్స్ కు పోటీ అనుభవం ఇస్తుంది. ఒడిస్సీ ఓఎల్ఈడీ జీ9 నాజూకైన డిజైన్ తో నాజూకైన లోహపు ఫ్రేమ్ లోపల ఉంటుంది. మానిటర్ వెనక ఎంతో ఇష్టపడే కోర్ సింక్ మరియు కోర్ లైటింగ్ + స్క్రీన్ పై రంగులను జత చేయడానికి, కంటెంట్ మరింత లీనమయ్యేలా చేయడానికి మరియు గేమింగ్ అనుభవాన్ని వాస్తవంగా అందచేయడానికి ఆధునిక లైటింగ్ టెక్నాలజీని వినియోగిస్తుంది. బిల్ట్-ఇన్ స్టీరియో స్పీకర్స్ గొప్ప సౌండ్ తో ఆన్-స్క్రీన్ కంటెంట్ కు పూరకంగా ఉంది. “కొత్త గేమింగ్ మానిటర్స్ శ్రేణితో, భారతదేశంలో ఓఎల్ ఈడీ గేమింగ్ కొత్త యుగాన్ని పరిచయం చేయడానికి మేము గర్విస్తున్నాం. అత్యంత అనుభవజ్ఞులైన గేమర్స్ డిమాండ్స్ మరియు అంచనాలకు అనుగుణంగా ఉండటానికి, మేము జీ9 సీరీస్ ను ఆధునిక టెక్నాలజీతో మరియు గొప్ప ఫీచర్స్ తో తయారు చేసాం. నియో క్వాంటమ్ ప్రాసెసర్ ప్రోతో మద్దతు చేయబడిన, ఒక వివరణాత్మకమైన, స్పష్టమైన డిస్ ప్లే మరియు సాటిలేని గేమింగ్ ఫీచర్స్ తో మద్దతు చేయబడిన ఓఎల్ఈడీ జీ9 సీరీస్ భారతదేశంలో వాస్తవంగా ఓఎల్ఈడీ స్థాయిని పెంచింది” అని పునీత్ సేథీ, వైస్ ప్రెసిడెంట్, కంజ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఎంటర్ ప్రైజ్ బిజినెస్, శామ్ సంగ్ ఇండియా అన్నారు.
ఇంతకు ముందు లేని విధంగా సినిమా మరియు గేమింగ్ వంటి అనుభవం
నియో క్వాంటమ్ ప్రాసెసర్ ప్రో చేరిక ఒడిస్సీ ఓఎల్ఈడీ జీ9ను ఇతర ఓఎల్ఈడీ గేమింగ్ మానిటర్స్ కంటే ప్రత్యేకంగా నిలిపింది. విస్తృతమైన లెర్నింగ్ అల్ గోరిథమ్ ను వినియోగిస్తూ, ఇది తెలివిగా చిత్రాలను విశ్లేషిస్తుంది మరియు కాంట్రాస్ట్ ను ఎక్కువ చేస్తూ బ్రైట్ నెస్ ను ఆటోమేటిక్గా సర్దుబాటు చేస్తుంది. ఇది మానిటర్ ప్రతి వివరాన్ని పునరుద్ధరించడానికి మరియు అత్యంత గొప్ప చిత్రాలు, ఒక్కొక్క పిక్సెల్ ను అందచేయడానికి వీలు కల్పిస్తుంది. స్మార్ట్ టీవీ అనుభవం ఎల్ఓటీ హబ్ మరియు వాయిస్ అసిస్టెన్స్ తో కలిపి సినిమా వంటి శ్రేష్టత యొక్క పరిపూర్ణమైన మిశ్రమంతో కలిపి ఉంది. ఇంకా, పెద్ద స్క్రీన్ సూపర్-అల్ట్రా వైడ్ దృశ్యాలను అందిస్తూ ప్రతి ఒక్కరికి దృశ్యపరమైన విందు అందిస్తుంది. శామ్ సంగ్ ఓఎల్ఈడీ యొక్క రంగులను మార్చే సామర్థ్యం, క్వాంటమ్ డీఓటీ (క్యూడీ) తో మద్దతు చేయబడి రంగుల స్వచ్ఛత మరియు విశాలమైన రంగులు యొక్క ఉన్నత స్థాయితో ఉన్నతమైన రంగుల పెర్ఫార్మెన్స్ కు అనుమతి ఇస్తుంది.
మెరుగైన గేమింగ్ అనుభవం కోసం అప్ గ్రేడ్ చేయబడిన పెర్ఫార్మెన్స్
ఏఎండీ ఫ్రీ సింక్™ ప్రీమియం ప్రో ఒడిస్సీ ఓఎల్ఈడీ జీ9 ఉన్నతమైన, సాఫీ గేమ్ ప్లే అనుభవాన్ని మరింత పెంచింది. డిస్ ప్లే హెచ్డీఆర్™ ట్రూ బ్లాక్ 400తో, మానిటర్ ఆడుతున్న గేమ్ లేదా యూజర్ చూస్తున్న కంటెంట్ తో సంబంధం లేకుండా అతుల్యమైన వివరాలు మరియు స్పష్టమైన రంగులు అందిస్తోంది. ఒడిస్సీ ఓఎల్ఈడీ జీ9 ఆటో సోర్స్ స్విచ్ + కలిగి ఉంది. కనక్ట్ చేయబడిన డివైజెస్ ను ఆన్ చేసినప్పుడు మానిటర్స్ గుర్తుపట్టడానికి అవకాశం ఇస్తుంది. ఇది గేమింగ్ లో లీనమవడాన్ని పెంచుతుంది మరియు యూజర్ వివిధ పనులను మరింత సమర్థవంతంగా చేయడానికి అవకాశం ఇస్తుంది.
ధర మరియు లభ్యత
ఒడిస్సీ జీ95 ఎస్ సీ ఓఎల్ఈడీ మానిటర్ భారతదేశలో నలుపు రంగులో రూ. 1,99,999కి లభిస్తోంది. కస్టమర్స్ శామ్ సంగ్ అధికారిక ఆన్ లైన్ స్టోర్ శామ్ సంగ్ షాప్ అమేజాన్ నుండి మరియు అన్ని ప్రముఖ రీటైల్ స్టోర్స్ నుండి మానిటర్స్ ను కొనవచ్చు. మరింత సమాచారం కోసం, దయచేసి సందర్సించండి https://www.samsung.com/in/monitors/gaming/
ఆఫర్
ఒడిస్సీ ఓఎల్ ఈడీ జీ95 ఎస్ సీ నో కాస్ట్ ఈఎంఐ పై, తక్షణమే కార్ట్ డిస్కౌంట్ రూ. 3,500/-కి అన్ని ప్రముఖ బ్యాంక్స్ క్రెడిట్, డెబిట్ కార్డ్స్ పై లభిస్తోంది.
ఒడిస్సీ జీ95 ఎస్ సీ ఓఎల్ ఈడీ ఒడిశ్సీ మానిటర్స్ లో అతి వేగమైన గేమింగ్ మానిటర్ మరియు దీనికి శామ్ సంగ్ నియో క్వాంటమ్ ప్రాసెసర్ ప్రో ఇన్ స్టాల్ చేయడం వలన భారీ వ్యూయింగ్ అనుభవం ఇస్తుంది. జీటీజీ 0.03 ఎంఎస్ & 240 హెచ్ రిఫ్రెష్ రేట్ ఒడిశ్సీ మానిటర్ ను వేగవంతమైన ప్రతిస్పందన సమయం అందించేలా మరియు సాటిలేని పెర్ఫార్మెన్స్ ఇచ్చేలా చేసింది. గేమింగ్ మానిటర్ ప్రపంచంలోనే మొదటి డీక్యూ హెచ్ డీ ఓఎల్ఈడీ (5120×1440) రిజల్యూషన్ కలిగి ఉండి గేమర్స్ నిమగ్నమయ్యే మరియు నిజ జీవిత అనుభవం పొందడానికి వీలు కల్పిస్తుంది. ఒడిస్సీ జీ95 ఎస్ సీ ఓఎల్ ఈడీకి ఉన్న స్లిమ్ మెటల్ డిజైన్ వలన ప్రీమియం అనుభవం ఇస్తుంది మరియు తమ డిజైన్ ప్యానల్ లో కోర్ లైటింగ్ + అందిస్తుంది. మానిటర్ స్మార్ట్ టీవీ యాప్స్, ఎల్ఓటీ హబ్, మరియు వాయిస్ అసిస్టెంట్ వంటి స్మార్ట్ ఫీచర్స్ ను మద్దతు చేస్తూ మెరుగైన గేమింగ్ అనుభవం ఇస్తుంది.
Odyssey G93SC
ఒడిస్సీ జీ93 ఎస్ సీ మానిటర్ 329 నిష్పత్తితో డ్యూయల్ క్యూహెచ్ డీ (5120×1440) అందిస్తుంది. గేమింగ్ మానిటర్ 240 హెచ్ జడ్ రిఫ్రెష్ రేట్ వరకు మద్దతు చేస్తుంది మరియు 0.03 ఎంఎస్ (జీటీజీ) ప్రతిస్పందన సమయం వేగవంతమైన, సాఫీ ప్రతిస్పందనకు అవకాశం ఇస్తుంది మరియు ఖచ్చితమైన మౌస్ కదలికలకు వీలు కల్పిస్తుంది. ఒడిస్సీ జీ93 ఎస్ సీ నాజూకైన లోహపు డిజైన్ యాంటీ-గ్లేర్ మరియు యాంటీ-రిఫ్లక్షన్ ఫీచర్స్ అందిస్తుంది మరియు గేమర్స్ దీనిని ప్రశంశిస్తారు. ఏఎండీ ఫ్రీసింక్ ప్రీమియ ప్రో ఫీచర్ ప్రత్యేకంగా నిలిచి అత్యంత సాఫీ మరియు వేగవంతమైన యాక్షన్ గేమ్ ప్లేను అందిస్తుంది, స్టట్టరింగ్, ఇన్ పుట్ లేటెన్సీ మరియు అత్యంత తీవ్రమైన పరిస్థితులలో కూడా స్క్రీన్ టియరింగ్ లను తగ్గిస్తుంది.
Odyssey G85SB
ఒడిస్సీ జీ85 ఎస్ బీ మానిటర్ 175 Hz రిఫ్రెష్ రేట్ మరియు అల్ట్రా WQHD (3440X1440) హై రిజల్యూషన్ ను కలిగి ఉంది. ఒడిస్సీ మానిటర్స్ లో అత్యంత వేగవంతమైన రెస్పాన్స్ సమయాన్ని గేమింగ్ మానిటర్ అందిస్తోంది. ఇది స్మార్ట్ టీవీ యాప్స్ ను కూడా సులభంగా యాక్సెస్ చేయడానికి అవకాశం కల్పిస్తూ స్మార్ట్ వినోదం కోసం పరిపూర్ణమైన ఎంపికగా చేసింది. కోర్ సింక్ ఫీచర్ గేమ్ ఆన్-స్క్రీన్ రంగులతో జత కలిసి గేమర్స్కు మరింత లీనమయ్యే గేమింగ్ అనుభవాన్ని మెరుగైన పిక్చర్ నాణ్యత ద్వారా అందిస్తోంది. ఏఎండీ ఫ్రీసింక్ ప్రీమియం ప్రో సాఫీ మరియు వేగవంతమైన గేమ్ ప్లేని అందిస్తూ మానిటర్ ను గేమర్స్ ప్రాధాన్యతనిచ్చే ఎంపికగా చేసింది.
న్యూస్రూమ్ లింక్ : శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కం. లిమిటెడ్ను గురించి శామ్సంగ్ ప్రపంచానికి ప్రేరణనిస్తుంది, మార్పులను కలిగించే ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానాలతో భవిష్యత్తుకు రూపకల్పన చేస్తుంది. టివిలు, స్మార్ట్ఫోన్లు, ధరించగల ఉపకరణాలు, టాబ్లెట్లు, డిజిటల్ ఉపకరణాలు, నెట్వర్క్ సిస్టమ్లు మరియు మెమొరీ, సిస్టమ్ ఎల్ఎస్ఐ, ఫౌండ్రీ మరియు ఎల్ఇడి సొల్యూషన్ల ప్రపంచాన్ని సంస్థ పునర్నిర్వచిస్తోంది. శామ్సంగ్ ఇండియాను గురించి తాజా వార్తల కోసం దయచేసి శామ్సంగ్ ఇండియా న్యూస్రూమ్ను http://news.samsung.com/in వద్ద సందర్శించండి. హిందీ కొరకు, శామ్సంగ్ న్యూస్రూమ్ భారత్ను https://news.samsung.com/bharat వద్ద సందర్శించండి. @SamsungNewsIN వద్ద మీరు మమ్ములను ట్విట్టర్ పై అనుసరించవచ్చు.

Spread the love