లంక పే పేరుతో శ్రీలంకలో ఫోన్ పే సేవలు ప్రారంభం..

నవతెలంగాణ – శ్రీలంక: భారతదేశంలో యూపీఐ లావాదేవీల సంస్థ ఫోన్ పే శ్రీలంకలో తన సేవలను అధికారికంగా  ప్రారంభించినట్లు శ్రీలంకలోని భారత హైకమిషన్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ యూపీఐ సేవలు అందుబాటులోకి రావడం వల్ల శ్రీలంకకు అధికంగా పర్యటనకు వెళ్లే భారతీయులకు మరింత సౌలభ్యాన్ని కల్పిస్తుందని తెలిపింది. కాగా దీనిని ఆ దేశంలో లంకా పే తో కలిపి తాము ఆపరేట్ చేస్తున్నట్లు ఫోన్ పే ప్రకటించింది. అలాగే భారతీయ పర్యాటకులు తమ ఫోన్ పే ద్వారా లంకా పే క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవచ్చని.. పర్యటకులు తమ వెంట నగదును తీసుకెళ్లాల్సిన అవసరం లేదని వారు వివరించింది.

 

Spread the love