నూతన ఎస్సైని కలిసిన జిల్లా అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు

నవతెలంగాణ -తాడ్వాయి
తాడ్వాయి పోలీస్ స్టేషన్ కు నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన నూతన ఎస్సై బి. ఓంకార్ యాదవ్ ను అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కురెందుల సమ్మక్క, జిల్లా కమిటీ సభ్యులతో కలిసి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన ఎస్సై ఓంకార్ యాదవ్ శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న దురాగతాల గురించి చర్చించారు. పోలీస్ శాఖ అండగా ఉండాలని ఆకాంక్షించారు. వారి వెంట అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు సరిత, నిర్మల, రమ తదితరులు పాల్గొన్నారు.
Spread the love