30న వేతనంతో కూడిన సెలవు

నవతెలంగాణ హైదరాబాద్‌: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్న ఈనెల 30న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ నిర్ణయించింది. ఈనేపథ్యంలో కర్మాగారాలు, దుకాణాలు, పరిశ్రమల్లో పనిచేసే సిబ్బందికి వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కార్మిక శాఖ ప్రకటనలో పేర్కొంది.

Spread the love