అందరం కలిసి పని చేద్దాం..

– కార్యకర్తల నిర్ణయమే నా నిర్ణయం డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్

– అసెంబ్లీ బరిలో ఉండాలంటూ కార్యకర్తల పట్టు గెలుస్తామన్న ధీమా వ్యక్తం
నవతెలంగాణ -తాడ్వాయి
అందరం కలిసి పని చేద్దాం.. అని అందరి కార్యకర్తల ఇష్టమే నా ఇష్టం అని స్వర్గీయ మాజీ మంత్రి అజ్మీర చందులాల్ గారి తనయుడు, ములుగు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ అజ్మీర ప్రహ్లాద్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ముఖ్య అనుచరులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వారితో చాలాసేపు ఇష్ట గోష్టి నిర్వహించారు. మండలం సీనియర్ నాయకులతో భవిష్యత్ కార్యాచరణ పై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ములుగు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డాక్టర్ అజ్మీరా ప్రహ్లాద్ మాట్లాడుతూ ములుగు నియోజకవర్గంలో మాజీ మంత్రివర్యులు అజ్మీరా చందులాల్ ఎన్నో అటు పోట్లను ఎదుర్కొని ప్రజలతో మమేకమవుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారి పిలుపుమేరకు ఉద్యమంలో కి చేరి తెలంగాణ కోసం కొట్లాడి  తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లి తెలంగాణ సాధించడంలో  నేను (ప్రహ్లాద్), మా నాన్న చందులాల్ ఉద్యమం చేసిన వాళ్లమేనని ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ములుగు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొంది మంత్రి హోదాలో ములుగు నియోజకవర్గ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయి ప్రజలతో మమేకమై అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఆజ్మీర చందులాల్ ది అని పేర్కొన్నారు. వారి నాయకత్వం కింద మనందరం కూడా ఎదిగినటువంటి లీడర్స్ మేనని అజ్మీరా ప్రహ్లద్ అన్నారు. ఈ నియోజకవర్గం కోసం ఆజ్మీర చందులాల్ తన చివరి శ్వాస వరకు, నేను మీరందరూ బిఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడ్డామని  ఈ నియోజకవర్గ ప్రజలతో నాయకులతో మమేకమై ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందు వరుసలో ఉన్నానని మీ అందరి సహకారంతో కార్యకర్తల ఆభీష్టం మేరకు నేను నడుచుకుంటానని మన ముఖ్యమంత్రి కేసీఆర్  ములుగు నియోజకవర్గ అసెంబ్లీ టికెట్ నాకు ఇస్తారని ఆశించా, చివరకు టిక్కెట్ ఇవ్వకపోవడం  చాలా బాధాకరమని అన్నారు. చివరి వరకు అసెంబ్లీ టికెట్ ఇస్తారని ఆశించాం కానీ  ఇవ్వలేదని కావున మీ అందరి అభిప్రాయం మేరకు నడుచుకుంటానని ప్రహ్లద్ అన్నారు అందరి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలందరూ మాట్లాడుతూ ప్రహ్లాదన్న ఎటుంటే, మేము అటే సపోర్ట్ చేస్తాం, అధిక మెజార్టీతో ప్రహ్లాదన్నని గెలిపిస్తాం.. ప్రహ్లాదన్న జిందాబాద్.. ప్రహ్లాదన్న నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు. ప్రహ్లాదన్న ఇండిపెండెంట్ వేసిన, వేరే పార్టీ నుండి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ముక్తకంఠంతో తెలియజేశారు. నేను మీ అందరికీ వెంట ఉంటానని, గెలిచిన,ఓడిన ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ఉంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నార్లాపూర్ ఎంపిటిసి కుక్కల శ్రీను, ఊరట్టం సర్పంచ్ గొంది శ్రీధర్, మేడారం మాజీ సర్పంచ్ గడ్డం సంధ్యారాణి, నార్లాపూర్ ఉపసర్పంచ్ రతన్ సింగ్, బయ్యక్కపేట సర్పంచ్ గుర్రం రామసమ్మి రెడ్డి, ఉద్యమకారుల సంఘం జిల్లా అధ్యక్షులు పత్తి గోపాల్ రెడ్డి, ముస్లిం మైనార్టీ మండల నాయకులు సయ్యద్ హుస్సేన్ (వహీద్),బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుభాష్ రెడ్డి, కడారి సమ్మిరెడ్డి, జైపాల్ రెడ్డి, ముండ్రాతి శ్రీను, మలహల్రావు, గడ్డం వెంకటేశ్వర్లు, సుభాష్ గౌడ్, ఎనగంటి భద్రయ్య, భూక్య శ్రీను, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love