Thursday, May 28, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యా వ్యతిరేక విధానాలను ఖండిద్దాం

విద్యా వ్యతిరేక విధానాలను ఖండిద్దాం

- Advertisement -

– జూన్ 5 ధర్నా, ర్యాలీని విజయవంతం చేద్దాం
– టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్
నవతెలంగాణ – కామారెడ్డి :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ విద్యా రంగంపై అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చర్యలను ఖండిస్తూ జూన్ 5న హైదరాబాద్‌లో నిర్వహించే ర్యాలీ, ధర్నాను విజయవంతం చేయాలని టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం కామారెడ్డి జిల్లా కార్యాలయంలో తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిహెచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు జూన్ 5న హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ర్యాలీ నిర్వహించి, అనంతరం ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమాలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలంటే విద్యారంగానికి కనీసం 20 నుంచి 25 శాతం వరకు బడ్జెట్ కేటాయించాలని, పాఠశాలల మూసివేత నిర్ణయాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, మౌలిక వసతులను కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా విద్యా పరిరక్షణ కమిటీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు లింగం మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం తెలంగాణ సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులను చైతన్యపరుస్తూ పోరాటం కొనసాగిస్తోందన్నారు.

గౌరవ అధ్యక్షులు కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలంటే పర్యవేక్షణ అధికారులను నియమించడం, తరచూ డీఎస్సీలు నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడం, టీచింగ్ మరియు నాన్-టీచింగ్ సిబ్బందిలో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవడం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యా పరిరక్షణ కమిటీ గౌరవ అధ్యక్షులు కే శ్రీనివాస్, సహాధ్యక్షులు విజయరామరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కే వేణుగోపాల్, బహుజన విద్యార్థి మోర్చా జిల్లా అధ్యక్షులు విట్టల్, డిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు రాజేందర్, టిపిటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -