సంగు రవీందర్ ఆశయాలను కొనసాగిద్దాం: కొండమడుగు నరసింహ

నవతెలంగాణ – భువనగిరి
కామ్రేడ్ సంగు రవీందర్ ఆశయాలను కొనసాగిద్దామని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ బట్టుపల్లి అనురాధలు తెలిపారు. శుక్రవారం రాత్రి స్థానిక సుందరయ్య భవన్లో సంగు రవీందర్ 9వవర్ధంతిని సీపీఐ(ఎం) పట్టణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రాష్ట్రస్థాయిలో పనిచేసే యువతకు ఆదర్శంగా ఉన్నారని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలను యువతకు చెప్పి ప్రజాసంఘాలను ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేశాడు. వారి ఆశయాలు అడుగుజాడల్లోనే నడవాలని వారు కోరారు. ఇప్పటి రాజకీయాలకు అప్పటి రాజకీయాలకు చాలా తేడాలు వచ్చాయన్నారు. అప్పుడు ఒక ఆశయం కోసం అన్ని పార్టీలు క్రమశిక్షణగా పని చేశాయన్నారు. కేంద్రంలో బీజేపీ  నరేంద్ర మోడీ కార్పొరేట్ వ్యక్తులకు ప్రభుత్వ సంస్థలను అప్పనంగా  అప్పజెప్తూ దేశా ఆర్థిక వ్యవస్థకు నష్టం చేకూరుస్తున్నారని తెలిపారు. కొంత మంది పెట్టుబడిదారులకే రాయితీలు ఇస్తూ పెద్ద పెద్ద కంపెనీలు అప్పులు తీసుకొని బ్యాంకులకు ఎగ్గొట్టి వారికి మాఫీ   చేస్తున్నారని తెలిపారు. కార్పొరేట్  మన్నల్ని పొందుతూ మన దేశానికి ఇతర దేశస్తులకు స్వాగతం పలుకుతూ పెట్టుబడులు పెట్టించి, ప్రభుత్వ భూములను వారికి కట్టబెడుతున్నారని విమర్శించారు. పేదలను దోచుకోవడానికి అనువైన భారతదేశం అని చెప్పి బడా కంపెనీలను భారతదేశంలో తీసుకురావడానికి ఎన్నో రకాల రాయితీలు   ఇస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. పేదవాడు మరింత పేదవాడిగా ధనవంతులు మరింత ధనవంతులుగా మన దేశంలో అవుతున్నారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో  పట్టణ  కార్యదర్శి మాయ కృష్ణ, పట్టణ కమిటీ కార్యవర్గ సభ్యులు గద్దె నరసింహ, గంధ మల్ల మాతయ్య, వనం రాజు, బందెల ఎల్లయ్య, గీస అంజన్న,దెయ్యాల నరసింహ, జనియాలు పాల్గొన్నారు.
Spread the love