సావిత్రిబాయిపూలే స్ఫూర్తితో మహిళా హక్కులకై పోరాడుదాం…

Let's fight for women's rights in the spirit of Savitribai...– ఐద్వా మండల కార్యదర్శి కొండమడుగు నాగమణి ….
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
భారతదేశ మొట్టమొదటి ఉపాధ్యాయురాలు,  చదువుల తల్లి సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మహిళలపై జరుతున్న దాడులకు, హత్యలకు, అత్యాచారాలకు వ్యతిరేకంగా మహిళల హక్కులకై ఐక్యంగా పోరాడుదామని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) భువనగిరి మండల కార్యదర్శి కొండమడుగు నాగమణి పిలుపునిచ్చినారు. శుక్రవారం ఐద్వా భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా మండలంలోని చీమల కొండూరు, ముస్త్యాలపల్లి, ముత్తిరెడ్డిగూడెం గ్రామాలలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులు అర్పించిన అనంతరం ఆయా గ్రామాలలో సభా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా నాగమణి పాల్గొని మాట్లాడుతు  పురుషాధిక్యత ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధావులందరికీ కూడా సావిత్రిబాయి కేవలం జ్యోతిరావు పూలే భార్యగా మాత్రమే తెలుసునని ఆవేదన వెలిబు చ్చారు. కానీ సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి, స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకురాలు సావిత్రిబాయి పూలేనని అన్నారు. ఆనాడు కులానికి వ్యతిరేకంగా పితృస్వామ్య వ్యవస్థపై తమ కలంతో  యుద్ధం నడిపిన కవయిత్రి అన్నారు.తన యుక్తవయసులోనే శూద్రులకు, దళితులకు పాఠశాలలు నడిపిన గొప్ప మానవతావాది సావిత్రిబాయి పూలే.
స్త్రీ పురుషులు కులమతాలకతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కుని అందుకు అందరూ చదువుకోవాలని, అందరూ సమానంగా బ్రతకాలని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి పూలేనని అన్నారు. నాటి, నేటి సమాజంలో సావిత్రిబాయి పూలే స్ఫూర్తి చాలా గొప్పదని 19వ శతాబ్దంలో ఆమె సాగించిన కృషి, ఉద్యమాలు కులం, వర్గం, లింగవివక్ష తోకముడవక తప్పలేదు. ఆమె స్ఫూర్తితోనే మన దేశంలో ఆడపిల్లలు అబ్బాయిలతో సమానంగా ఆధునిక విద్య చదువుతూ అన్నింట్లో ముందుండి పార్లమెంటులో, అసెంబ్లీలో ప్రజా ప్రతినిధులుగా మగవారితో సమానంగా ఉద్యోగాలలో రాణిస్తూ ముందుకు పోతున్నారంటే అందుకు స్ఫూర్తి సావిత్రిబాయి పూలనే అన్నారు. నేడు దేశంలో మహిళల పైన రోజురోజుకు అనేక రకాలైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు అత్యాచారాలు కొనసాగుతున్నాయని  ఈ దాడులకు వ్యతిరేకంగా నాటి నేటి స్ఫూర్తిదాత సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మహిళలు సంఘటితంగా, ఐక్యంగా ఉద్యమాలకు సిద్ధం కావాలని నాగమణి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల ఉపాధ్యక్షురాలు కొండ హైమావతి, మండల కమిటీ సభ్యురాలు బోడ సరిత, పల్లెర్ల పద్మ ఆయా గ్రామాలకు సంబంధించిన పల్లెర్ల సోనీ, మంగళపల్లి సప్న, జిల్లా కవిత, పల్లెర్ల చంద్రమ్మ, బొజ్జ అలివేలు, గౌటి మంజుల, ఎడ్ల అండాలు, మాకొల్ల రజిత, ఎడ్ల ప్రవళిక, గోడ మాధవి, మమత, పల్లెర్ల రేణుక, సరూప, శ్యామల, విజయ, కృష్ణవేణి, నరసమ్మ, బాలమ్మ, నరసమ్మ , లావణ్య, చంద్రమ్మ, నరసమ్మ, అండాలు, పోచమ్మ, కళమ్మ, మాధవి, లావణ్య, ముత్తమ్మ, మమత, కిష్టమ్మ, రేణుక లు పాల్గొన్నారు.
Spread the love