దొడ్డి కొమరయ్య ఆశయ సాధనకు పోరాడుదాం

– సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య
నవతెలంగాణ- పరిగి
దొడ్డి కొమరయ్య ఆశయ సాధనకు పోరాడుదా మని సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం. వెంకటయ్య అన్నారు. మంగళవారం పరిగి పట్టణ కేంద్రంలోని కొడంగల్‌ చౌరస్తాలో దొడ్డి కొమరయ్య 78వ వర్థంతిని సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటా నికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎం వెంక టయ్య మాట్లాడుతూ దున్నేవాడికే భూమి కావాలని వెట్టిచాకిరి విముక్తికు దొరలు జమీందారుల జాగీదా రుల ఆగడాలని ఎదిరించి ఎర్రజెండా నాయకత్వంలో పోరాడారని, శిస్తూ వసూలుకు వ్యతిరేకంగా ప్రాణాల ను సైతం అర్పించారన్నారు. నైజాం నిరంకుష త్వాలకు వ్యతిరేకంగా జరిగిన పోరులో దొడ్డి కొమర య్య అమరుడయ్యాడన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం 10 లక్షల ఎకరాల భూమి పంపిణీ చేసిం దని రూ.3 వేల గ్రామాలు విముక్తి కాబడినయని, సుమారు 4 వేల మంది కార్యకర్తలు బలిదానం గావించారన్నారు. దొడ్డి కొమరయ్య స్ఫూర్తిని తీసుకొ ని భవిష్యత్తు ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. నేడు రాజకీయాలలో కులం మతం ప్రాంతం భేదం అనే విచ్ఛిన్నకర ఉద్యమాలు ముందు కు వస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మత ఉన్మాదపు చర్యలకు పాల్పడుతూ ప్రజలను చీల్చే కుట్రలకు పాల్పడుతుందన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్‌ కోడ్‌ తీసుకొని వచ్చి కార్మికుల హక్కులను కాల రాశారన్నారు. దేశంలో నిత్యవసర ధరలు కూరగా యల ధరల విపరీతంగా పెరిగాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలైన డబుల్‌ బెడ్రూ రూమ్‌ ఇండ్లు, గృహలక్ష్మి పథకాలు బీసీబంధు లాంటి పథకాలు ఆకర్షణీయంగా కాకుండా అమలు జరిగేందుకు కృషి చేయాలని కోరారు. పోడు భూము ల పట్టాలు అర్హత ఉన్న అందరికీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎల్‌ హెచ్‌ పిఎస్‌ రాష్ట్ర నాయకులు గోవింద్‌ నాయక్‌, సీపీఐ(ఎం) నాయ కులు ఎండీ హబీబ్‌, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సత్యయ్య, రఘురామ్‌, శ్రీనివాస్‌, శేఖర్‌, లాలప్ప, ఆసిద్‌, శివ ప్రశాంత్‌, రాజు, రహీమ్‌, రఫీ తదితరులు పాల్గొన్నారు.

Spread the love