– నకిలీ విత్తనాలు. ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు
– ఏడీఏ శంకర్ రాథోడ్. సీఐ శ్రీధర్‌రెడ్డి
నవతెలంగాణ-కొడంగల్
నకిలీ విత్తనాల నివారణకు అందరూ కలిసికట్టుగా పని చేసి నకిలీ విత్తనాలను రూపుమాపుదామన్ని ఏడీఏ శంకర్ రాథోడ్. సీఐ శ్రీధర్‌రెడ్డి అన్నారు. కోడంగల్‌లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో కోడంగల్, దౌల్తాబాద్, బోంరాస్ పేట్ మండలాల విత్తనాలు, ఎరువుల డీలర్లతో గురువారం అవగాహనా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులకు సరిపడ్డ విత్త నాలు, ఎరువులు అందుబాటులో ఉంచి నిబంధనల మేరకు అమ్మకాలు జరపాలన్నారు. లైసెన్స్ పొందిన డీలర్లు ఈపాస్ యంత్రాల ద్వారానే రైతులకు ఎరువులు విత్తనాలు విక్రయించాలని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు విక్రయించే సమయంలో కచ్చితంగా రసీదు రైతులకు అందించాలని సూచించారు. ఆధీకత డీలర్లు అందు బాటులో ఉన్న విత్తనాల స్టాక్ వివరాలను ఎప్పటికప్పుడు నోటీస్ బోర్డ్‌పై నమోదు చేయాలని ఆదేశించారు. విత్తన వ్యాపారులు తమ దుకాణాలలో తప్పనిసరిగా రిజిస్టర్ నిర్వహించాలని పంట రకము, ల్యాట్ నెంబర్, విత్తన పరీక్ష తేదీ, కాలం గడువు తేదీ, రైతు పేరు వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు దుకాణాలు తనిఖీ చేస్తారన్నారు. లైసెన్స్ కొనుగోలుదారులకు కనిపించే విధంగా పెట్టాలని ధరల పట్టిక రైతులకు కనిపించే విధంగా ఉంచాలన్నారు. వ్యవ సాయశాఖ పోలీస్ శాఖ టీం ఏర్పాటు చేసి నకిలీ విత్తనాల నివారణకు కషి చేస్తున్నామన్నారు. లూజ్ విత్తనాలు ఎ వరైనా అమ్మితే వ్యవసాయ శాఖ, పోలీస్ శాఖకు సమా చారం ఇవ్వాలన్నారు. లూజ్ విత్తనాలు వాడడం వల్ల పంట దిగుబడి తగ్గడంతో పాటు భూసారం కూడా తగ్గుతుందన్నారు. డీలర్ల దగ్గర కొనుగోలు చేసిన విత్తనాల రసీదును రైతులు జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. లూజు విత్తనాలు నివారించే బాధ్యత మనందరిపై ఉందన్నారు. రైతులు విత్తనాలను నాటుకోవాలంటే భూమిలో 60 శాతం తేమ ఉన్నప్పుడు నాటుకుంటే మొలకెత్తుతుందని రైతులకు చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఏవోలు లావణ్య, పద్మావతి, కొడంగల్, దౌల్తాబాద్, బోంరాస్‌పేట్ మండలాల విత్తనాల ఎరువుల డీలర్లు, ఏఈవోలు పాల్గొన్నారు.