కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దాం

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్‌
నవతెలంగాణ-గండిపేట్‌
కాంగ్రెస్‌ పార్టీని బలపోతం చేస్తామని రాష్ట్ర పిసిసి ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్‌ అన్నారు. సోమవారం గండిపేట్‌ మండల్‌ బండ్లగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ నాయకుల ముఖ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు పూలపల్లి కష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. ఎన్నికల్లో నియోజవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ వైపల్యాలను చెప్పాలన్నారు. బండ్లగూడ కాంగ్రెస్‌ నూతన కమిటీని ఎన్నుకున్నారు. బీసీ సెల్‌ ఎస్సీ సెల్‌, మైనారిటీ కాంగ్రెస్‌ కమిటీలను ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పూలపల్లి కష్ణారెడ్డి, ఉపాధ్యక్షులుగా తలారి ప్రేమ్‌ కుమార్‌ అజ్ఞాన్‌ సాదిక్‌,, ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, కార్యదర్శి శ్రీనివాస్‌, కోశాధికారి శ్రావణ్‌ కుమార్‌, కమిటీ సభ్యులు విష్ణు, బాల్రాజ్‌, రామచందర్‌, అంజయ్య యాదవ్‌, గోపాల్‌ ఎన్నుకున్నారు.

Spread the love