గెలుపోటములను సమానంగా చూడాలి

మోకిలలో సమ్మర్‌ కోచింగ్‌ వాలీబాల్‌ క్యాంపు
ఎంపీపీ గోవర్దన్‌రెడ్డి
నవతెలంగాణ-శంకరపల్లి
గ్రామీణ ప్రాంతాల్లో నుండే మట్టిలో మాణిక్యం లాంటి క్రీడాకారులు తయారవుతారని శంకర్‌పల్లి ఎంపీపీ గోవర్ధన్‌ రెడ్డి అన్నారు. సమ్మర్‌ కోచింగ్‌ క్యాంప్‌ వాలీబాల్‌ 2023 వాలీబాల్‌ స్పోర్ట్స్‌ డ్రెస్సెస్‌ పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ క్రీడా ప్రాంగణం మోకిలలో వర్త్య లక్ష్మీ లక్ష్మణ్‌ నాయక్‌ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు కూల్య నాయక్‌, చందర్‌ నాయక్‌ , శంకర్‌ నాయకులు సమ్మర్‌ కోచింగ్‌ వాలీబాల్‌ క్యాంపు 100 మంది పిల్లలకు డ్రెస్సులు పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. మా బంధువు రవికాంత్‌ రెడ్డి వాలీబాల్‌ ఇండియన్‌ టీంకు కెప్టెన్‌ గా వ్యవహరిస్తున్నారని అన్నారు. మంచి క్రమశిక్షణతో పట్టుదల కలిగి మన మండలానికి జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఇంత చక్కటి క్రీడా ప్రాంగణాన్ని తీర్చి దిద్దిన గ్రామ సర్పంచ్‌ సుమిత్ర మోహన్‌ రెడ్డిని అభినందించారు. అలాగే గత తొమ్మిది సంవత్సరాలుగా వాలీబాల్‌ సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపు నిర్వహిస్తున్న సామాజిక కార్యకర్త తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పాపా గారి ఆశీర్వాదమును అభినందించారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిని శ్రీ కష్ణప్రియ మాట్లాడుతూ గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి చక్కటి ఆటను ప్రదర్శించాలని క్రీడాకారులకు సూచించారు. ఇంత చక్కటి క్రీడా దుస్తులను అందజేసిన వర్త్య లక్ష్మణ్‌ నాయక్‌ వారి కుమారులను అభినందించారు. సమ్మర్‌ కోచ్‌ ఇన్‌చార్జి పాపగా ఆశీర్వాదం మాట్లాడుతూ గ్రామపంచాయతీ సంపూర్ణ సహకారం, జిల్లా క్రీడలు యువజనలు రంగారెడ్డి జిల్లా డి ఎస్‌ డి ఓ, దాతల సహకారం పత్రికా సోదరుల సహకారంతో ఇలాంటి క్యాంపులు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి మాజీ చైర్మన్‌ రాజు నాయక్‌, సామాజిక కార్యకర్త వాణి వేణు గోపాల్‌ రెడ్డి, వార్డు సభ్యులు చిట్టెంపల్లి శేఖర్‌, గ్రామస్తులు విటల్‌, ఉపాధ్యాయులు నర్సింగ్‌ రావు, రామకృష్ణ వాలీబాల్‌ కోచ్‌ శ్రీనాథ్‌ రెడ్డి, కిరణ్‌ కుమార్‌ ఆయా గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు.

Spread the love