కోనేరు నుంచి సంజరు మృతదేహాన్ని వెలికితీసిన రెస్క్యూ టీం

నవతెలంగాణ-ఆమనగల్‌
కడ్తాల్‌ మండలంలోని మైసిగండి మైసమ్మ దేవాలయం సమీపంలోని కోనేరులో ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ శాలిబండ ప్రాంతానికి చెందిన సంజరు (39) అనే వ్యక్తి ఈత కొడ్తూ గలంతైన విషయం విదితమే. ఈనేపథ్యంలో స్థానికులు తెలిపిన సమాచారం మేరకు ఆదివారం సాయంత్రం నుంచి స్థానిక పోలీసులు, మహేశ్వరం ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సోమవారం సాయంత్రం వరకు కోనేరులో ప్రతి అంగుళం గాలించి చివరకు సంజరు మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. అనంతరం సంజరు భార్య ప్రియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ హరిశంకర్‌ గౌడ్‌ తెలిపారు.

Spread the love