ఓటుతో కొడదాం

Let's voteఇప్పుడు ప్రజాస్వామ్యం
పరేషాన్‌లో పడ్డది
తన అడ్రస్‌కై వెదుకుతోంది
ఈడీ, సీబీఐని అడిగితే
తెలుస్తుందేమో..!

మంత్రదండ మాయలో
ఊగిపోతున్న వారి వద్ద
సమాధానం దొరుకుతుందనుకుంటే
అది మన భ్రమేనేమో….
లౌకికత్వం అంటే
నాలుగు దిక్కులూ
సమానమనుకున్నాం
కానీ ధర్మం పేరుతో
ద్వేషం సాంతం నింపుతున్నారు

దేశం రామరాజ్యం కావాలని
కోరుకుంటున్నారు
ఇక సీతలందరు
అడవుల పాలవుతారేమో
శంభూకుల తలలు
తెగిపడతాయేమో!

రాజ్యాంగంపై
సనాతన వస్త్రాన్ని కప్పి
కనుమరుగు చేసి
నిచ్చెనమెట్ల వ్యవస్థను
నిలబెట్టజూస్తున్నారు

ఒకే దేశం
ఒకే సంస్కృతి అంటారు
370, సీఏఏలతో
తరిమేయజూస్తారు

అందుకే
రాజ్యాంగ మూలస్తంభాల్ని
సార్వభౌమత్వాన్ని
కాపాడుకుందాం
విద్వేష రాజ్యాన్ని
కూల్చేద్దాం
అది ఓటుతోనే
సాధ్యమని రుజువుచేద్దాం
– శరత్‌ సుదర్శి,
7386046936

Spread the love