దేశానికి కావాల్సింది ‘ఎర్ర కాగితాలు’

What the country needs is 'red papers'కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2024 ఓట్‌ఆన్‌ ఎకౌంటు బడ్జెట్‌ ప్రవేశపెడుతూ 2014లో తాము అధికారంలోకి వచ్చేవరకు పాలించిన ప్రభుత్వాలు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా భ్రష్టు పట్టించాయో (తమ వాజ్‌పారు పాలన ఆరేళ్లనూ దాన్లో కలపాలనుకు న్నట్లుంది) శ్వేత పత్రం (తెల్ల కాగితాలు) ద్వారా తేల్చిపారేస్తానని హూంకరిం చారు. దానికి ప్రతిగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ అధ్యక్షులు మల్లికార్జున్‌ఖార్గే మీ పదేండ్ల పాలన బండారం తేల్చడానికి బ్లాక్‌ పేపర్‌ (నల్ల కాగితాలు) ప్రవేశపెడతానని ధీటుగా ప్రకటించారు. వీరిద్దరూ చెప్పే దాంట్లో అబద్దాల మాట ఎలా ఉన్నా ఒక నిజం మాత్రం ఉంది. 75 ఏండ్లు దేశాన్ని పాలించిన వీరు, మధ్యలో తొంగిచూసిన జనతా, నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాలు కలిసి మొత్తం మీద దేశాన్ని అధోగతి పాలు చేశాయన్నది మాత్రం వాస్తవం. పార్టీల అభిమానాల్ని పక్కనపెట్టి వాస్తవాలను వాస్తవాలుగా పరిగణించి పరిశీలిస్తే డెబ్బయి అయిదేండ్లుగా నడిచిన ఆర్థిక విధానాలు కొన్ని తాత్కాలిక ఉపశమనాలను కల్పించినా ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం చూపలేకపోయా యన్నది యదార్థం.
వామపక్షాలు అధికారంలోకి వచ్చిన కేరళ, పశ్చిమబెంగాల్‌, త్రిపుర వంటి రాష్ట్రాల్లో ముందుకు తెచ్చిన ప్రత్యామ్నాయాలను సహించలేని పాలక పార్టీలు ప్రారంభం నుండి కమ్యూనిస్టు పార్టీ పైన, వారి సైద్ధాంతిక అంశాల మీద దాడి చేస్తూనే ఉన్నాయి. 2008లో యూపీఏ ప్రభుత్వానికి ఇస్తున్న మద్దతును వామపక్షాలు ఉపసంహరించుకున్న సందర్భంలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ”హమ్మయ్య మా కాళ్లకి ఉన్న సంకెళ్లు తెగిపోయాయి. ఇక స్వేచ్ఛగా ఆర్థిక సంస్కరణలను (ఉదారవాద ఆర్థిక విధానాలను) అమలు చేసుకోవచ్చని” బడా పెట్టుబడిదారుల తరఫున ఊపిరి పీల్చుకోవడం మనం చూసాం. కానీ ఆ రోజు వామపక్షాలు ఒత్తిడి వలనే గ్రామీణ ఉపాధి హామీ పథకం, అటవీ చట్టం, సమాచార హక్కు చట్టం వంటివి వచ్చాయన్న సంగతి మనం మర్చిపోగలమా? ఏమైనా ఆ తరువాత క్రమంగా వామపక్షాలు బలహీనపడటంతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ఒకే తరహా ఆర్థిక విధానాలు, పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గ అనుకూల ఆర్థిక విధానాలు అమలులోకి రావడం మొదలైంది. సామ్రాజ్యవాద దేశాల ఒత్తిడి తీవ్రతరమైంది. ఆ దేశాల ప్రాపకం కోసం అర్రులు చాచడం ప్రారంభమైంది. పాలకవర్గ పార్టీలు జయప్రదంగా పాలకవర్గాల గురించి, ఆ వర్గాల ప్రయోజనాల గురించి, వాటి కోసం వారు పడుతున్న తాపత్రయం గురించి మాత్రం ప్రజల్లో చర్చలు రాకుండా జాగ్రత్త పడగలుగుతున్నాయి. ”ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనాలు దాగున్నాయో తెలుసుకోలేనం తకాలం ప్రజలు పదేపదే మోసపోతూనే ఉంటారు” అని ఓ ఎర్ర కాగితంలో లెనిన్‌ చెప్పాడు
గ్యారెంటీగా గ్యారెంటీ లేని గ్యారెంటీలు!
ఎన్నికల సీజన్‌ వచ్చింది. పోటీలు తీవ్రంగా ఉండను న్నాయి. ‘మోడీజీ గ్యారెంటీ’, ‘కాంగ్రెస్సే భవిష్యత్తుకు గ్యారెంటీ’ నినాదాలు ఆకాశాన్నం టుతున్నాయి. నిజానికి ఈ తతంగం కొత్తేమీ కాదు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గరీబీ హటావో, రైతు సాధికారిత, మహిళా సాధికారిత, దేశం వెలిగిపోతోంది, తాజాగా ఆత్మ నిర్భర భారత్‌, స్వచ్ఛ భారత్‌, మేకిన్‌ ఇండియా, స్వర్ణాంధ్ర, బంగారు తెలంగాణ, వికసిత భారత్‌, సబ్‌కా సాత్‌- సబ్‌కా వికాస్‌… ఇలా అన్ని రాష్ట్రాల్లోనూ, అన్ని భాషల్లోనూ పాలక పార్టీల ప్రభుత్వాలు ఎన్నికల వేళ మరింత బిగ్గరగా హోరెత్తిస్తున్నాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ పుట్టిన నాటి నుండి దాన్ని బలపరిచే రాజకీయ పార్టీలన్నింటినీ పీడించే సమస్య, దాన్నే వారి ఆయుధంగా మలుచుకునే సమస్య ‘పేదరికం’. మనదేశంలో కూడా పేదరికం నిర్మూలనకు సవాలక్ష పథకాలున్నాయి. కొన్ని రద్దయ్యాయి, కొత్తవి వస్తున్నాయి. లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. అయినా పేదరికానికి శాశ్వత పరిష్కారం వీళ్లకి దొరకటం లేదు. ఆ పేదరికం ఆకలిని, రక్తహీనతను, న్యూనతను, వివక్షను, అసమానతలను సష్టిస్తున్నది. నేడు పెట్టుబడిదారీ ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్ధిక సంక్షోభానికి మూలం కూడా ఈ పేదరికాన్ని నిర్మూలించలేని దానిలోని వైరు ధ్యమే. కానీ నిన్నటి కన్నా ఈ రోజు మెరుగా? గత ప్రభుత్వం కన్నా నేటి ప్రభుత్వం మెరుగా? అని ఆలోచించటం తప్ప మరో మార్గం లేదన్నట్లు బూర్జువా రాజ్యం నిరంతరం ప్రజల మనస్సులను నింపేస్తూనే ఉంటుంది.
పేదరికంపై ఎర్ర కాగితాలేమి చెబుతున్నాయి ?
సంక్షేమ పథకాల పేరిట ప్రభుత్వ సొమ్మును పంచి పెట్టడం వలన ప్రజలు సోమరులవుతున్నారని, ఆ సొమ్ముకు అలవాటు పడి కూలీకి రావటం లేదని పాలకవర్గాల ప్రతినిధులు వాపోతున్నారు. మధ్యతరగతిలో కూడా ఈ భావనకు మంచి గిరాకీ వచ్చింది. అలా అధికారంలో ఉన్న పార్టీలను తిట్టిన ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి రాగానే కొత్త రాగం ఎత్తుకుంటున్నాయి. మోడీ ‘రెేవడీ’ (పాలకోవా) అంటే ఉచితాలకు మేము వ్యతిరేకమని చెబుతూనే సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ ఉంటాడు. నిర్మలా సీతారామన్‌ స్వాతంత్య్రానంతరం మొట్టమొదటిసారి తమ ప్రభుత్వం 25 కోట్ల మందిని పేదరికం నుండి విముక్తి చేశారంటారు. కానీ మోడీజీ 80 కోట్ల మందికి అందిస్తున్న ఉచిత రేషన్‌ (బియ్యం,గోధుమలు) మరో ఐదేండ్లు కొనసాగించటం తమ గొప్పగా చెబుతున్నారు. 80 కోట్లమంది అంటే దాదాపు 57 శాతం మంది నిరుపేదరికంలో ఉన్నారనేగా!? అందువలన పేదరికం నిర్మూలించాలంటే పేదరికాన్ని చూసే చూపు మారాలి. పేదరికం పెట్టుబడిదారులు, వారి ఆర్థిక శాస్త్ర పండితులు చెబుతున్నట్లు అది జబ్బు కాదు, అది పెట్టుబడిదారీ విధానం అనే జబ్బు సష్టించే లక్షణం. ”పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాలు బలపడే కొద్ది అవి సరళమైన, ఏకోన్ముఖమైనవి కావని, ద్విముఖమైనవని రోజురోజుకి అర్థమవుతుంది. ఒక పక్క సంపద ఉత్పత్తి అవుతుంటే మరోపక్క పేదరికం ఉత్పత్తి సమాంతరంగా జరుగుతూ ఉంటుంది”. (తత్వశాస్త్ర దారిద్య్రం -మార్క్స్‌) కానీ పెట్టుబడిదారీ వర్గం వారి పండితులు మాత్రం ”ప్రకతిలో ప్రతి జననం అప్పుడు వచ్చే పురిటి నొప్పులు లాగా పారిశ్రామిక అభివద్ధిలో పేదరికం అనేది ఉంటుంది” (అదే గ్రంథం) అని బుకాయిస్తూ ఉంటారు. పేదరికం నిర్మూలన కోసం ఆర్థిక శాస్త్ర పాండిత్యం కావాలని పాకులాడనక్కర్లేదు. ”తమ కండ్ల ముందు ఏం జరుగుతుందో గ్రహించి దాన్ని ప్రచారం చేస్తే సరిపోతుంది. మనం ఎంతకాలం శాస్త్ర పరిజ్ఞానం కోసం వెతుకుతూ, ప్రణాళికలు రూపొందిస్తూ పోరాట ప్రారంభంలోనే ఉండిపోతామో పేదరికంలో పేదరికాన్ని మాత్రమే చూస్తాం. దాంట్లో పాత సమాజాన్ని కూలదోసే విప్లవాత్మక, విధ్వంసకర పాత్రను చూడలేము” (పై గ్రంథం నుండి) అని కార్ల్‌మార్క్స్‌ ప్రకటించాడు.
ఎర్రకాగితాలే (రెడ్‌ బుక్స్‌) శరణ్యం
ప్రపంచవ్యాప్తంగా ఎర్ర పుస్తకాల కోసం వెతుకులాట ప్రారంభ మైంది. కారణం నేటి ప్రపంచానికి ప్రత్యామ్నాయం కావాలి. పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ సమస్యలను పరిష్కరించలేని నిర్జీవస్థితికి జారుతూ ఉంటే, ప్రత్యామ్నాయం కోసం వెతుకులాట అనివార్యం. మార్క్స్‌ పెట్టుబడిదారీ వ్యవస్థ గురించి, అని వార్యంగా వచ్చే సంక్షోభం గురించి ఏమి చెప్పాడని తెలుసుకోవడానికి ఆయన రాసిన పెట్టుబడి గ్రంథాన్ని పెట్టుబడి దారీ మేధావులు తిరగేస్తున్నారు. కాలానుగుణంగా ఎన్ని మార్పులు వచ్చినా పెట్టుబడిదారీ వ్యవస్థ పతనమైతే రావలసింది సోషలిజమేనన్న సహజ సాంఘిక సూత్రాన్ని ప్రజలకు అందించగలగాలి. పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్లీనంగా అభివద్ధి చెందే ప్రాథమిక వైరుధ్యానికి పరిష్కారమే సోషలిజం. పెట్టుబడిదారీ వ్యవస్థలో ఉత్పత్తి సమాజపరంగా ఉంటుంది. పంపిణీ వ్యక్తి పరంగా ఉంటుంది. అంటే సమాజంలోని ప్రతి ఒక్కరూ కష్టించి సష్టించే సంపదని కొద్దిమంది హస్తగతం చేసుకుంటూ ఉంటారు. సంపదను కూడా ఉత్పత్తి లాగా సమాజపరం చేయడం ద్వారా అంటే సోషలిస్టు వ్యవస్థ నిర్మించుకోవడం ద్వారా అన్ని ఆర్థిక సమస్యలకు శాశ్వత పరిష్కారాలు దొరుకుతాయి.
గతంలో రష్యా, తూర్పు యూరప్‌ దేశాలలో నేడు చైనా, వియత్నాం, క్యూబా, ఉత్తరకొరియా, లావోస్‌ వంటి సోషలిస్టు దేశాలలో సంక్షోభరహిత ఆర్థిక అభివద్ధి కనబడుతుంది. అందువలనే పెట్టుబడిదారీ పాలకులు, వారి పార్టీలు ఎన్నికల చుట్టూ, సంక్షేమ పథకాల చుట్టూ పరిభ్రమించేటట్లు ప్రజల్ని తిప్పుతున్నారు. ఇప్పుడు బంతి కమ్యూనిస్టులు, వామపక్షాలు, ప్రగతిశీల, ప్రజాతంత్ర శక్తులు, పార్టీల కోర్టులో పడింది. ఈ శక్తులు ప్రస్తుతం బలహీనంగా ఉన్నా, వేగంగా ఆ బలహీనతను అధిగమించాలి. కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక పోరాటాలను పెంపొందిం చాలి. అందుకు కఠోర కషి చేయాలి. మార్క్సిస్టు శాస్త్ర మౌలిక గ్రంథాలను (రెడ్‌ బుక్స్‌) అధ్యయనం చేయాలి. ఈ సందర్భంగా అత్యున్నత ఎర్ర పుస్తకం కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక ముగింపులో కారల్‌మార్క్స్‌, ఏంగెల్స్‌లు వక్కాణించి ”కమ్యూనిస్టు విప్లవాన్ని చూసి పాలకవర్గాలని వణకనివ్వండి. శ్రామికులు తమ సంకెళ్లను తప్ప కోల్పోయేదేమీ లేదు. వారికి గెలవాల్సిన మరో ప్రపంచం ఉంది. ప్రపంచ కార్మికులారా ఏకంకండి!!” ఈ మాటలు మననం చేసుకుంటూ కార్యోన్ముఖులు కావాలి.
ఆర్‌. రఘు
9490098422 

Spread the love