పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం

Let's work towards winning the Parliament elections– కాంగ్రెస్‌ చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీంభరత్‌
నవతెలంగాణ-షాబాద్‌
రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేద్దామని కాంగ్రెస్‌ చేవెళ్ల నియోజక వర్గ ఇన్‌చార్జి పామెన భీంభరత్‌ అన్నారు. శుక్రవారం భీంభరత్‌ నివాసంలో ముదెంగూడ ఎంపీ టీసీ కుమ్మరి చెన్నయ్య ఆధ్వర్యంలో సంకేపల్లిగూడ, శేరిగూడ బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలన్నారు. ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపిం చేందుకు కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు నర్సింహారెడ్డి, అంజయ్య, అంజిరెడ్డి, వెంకటయ్య, సత్యనారాయణ, సత్యం, నర్సింహులు, వెంకటయ్య, ఆశోక్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love