Friday, July 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని సన్మానించిన ఎల్ ఎచ్ పి ఏస్ నాయకులు..

గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని సన్మానించిన ఎల్ ఎచ్ పి ఏస్ నాయకులు..

- Advertisement -

నవతెలంగాణ-కామారెడ్డి : కామారెడ్డి పట్టణ కేంద్రంలో శుక్రవారం  గడ్డం చంద్రశేఖర్ రెడ్డి నివాసంలో లంబాడ హక్కుల పోరాట సమితి (LHPS) నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు.

ఈ సందర్భంగా బంజారా సమాజం ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించారు. సమాజ అభివృద్ధికి అవసరమైన అంశాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని నాయకులు కోరారు.

ఈ కార్యక్రమంలో ఎల్ ఎచ్ పి ఏస్  రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ రాథోడ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవీందర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు రూప్ సింగ్ నాయక్, ఎస్‌ఎస్ నగర్ మండల అధ్యక్షుడు మాలోత్ పీర్ సింగ్ నాయక్, ఎల్లారెడ్డి డివిజన్ ఇన్‌చార్జి బానోత్ మదన్ లాల్, కామారెడ్డి టౌన్ ప్రెసిడెంట్ మోహన్ నాయక్, నీలం మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -