Friday, July 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ భుజంగరావు

పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అడిషనల్ కలెక్టర్ భుజంగరావు

- Advertisement -

నవతెలంగాణ-బాల్కొండ : బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు వి. భుజంగరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల మౌలిక వసతులు, విద్యార్థులకు అందుతున్న బోధనా ప్రమాణాలు, ఉపాధ్యాయుల ఖాళీల వివరాలు మధ్యాహ్న భోజన నాణ్యత, తరగతి గదుల నిర్వహణపై సమగ్రంగా సమీక్షించారు.విద్యార్థుల హాజరు శాతాన్ని, తరగతి గదుల్లో ఉపాధ్యాయులు బోధిస్తున్న విధానాన్ని ఆయన పరిశీలించారు.విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం, పరిసరాల పరిశుభ్రతపై ఆరా తీశారు.విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరచడానికి ఉపాధ్యాయులకు, సంబంధిత విద్యాశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బట్టు రాజేశ్వర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -