– కోత పెట్టిన డబ్బులు వెంటనే ఇవ్వాలి
– సీఐటీయూ నాయకులు
నవతెలంగాణ – బంజారా హిల్స్..
పారిశుధ్య కార్మికులకు వేతనాల్లో కోతలేంటని..వారికి వేతనాల్లో కటైన డబ్బులు వెంటనే ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జీహెచ్‌ఎంసీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో శాంతియుత నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. నగరంలో ఖైరతా బాద్ సర్కిల్ 18 సర్కిల్ 13 సర్కిల్ 12 లలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు మూడు నెలలుగా వేతనం పూర్తిగా రావడం లేదని తెలిపారు. రూ. 4000 నుంచి రూ. 5000 వరకు వేతనం కట్ అవుతున్నదన్నారు. కొంతమంది కార్మికులకు ఈనెల 2000 నుంచి 3000 వేతనం వచ్చిందని, కొంతమంది కార్మికులు ఆనారోగ్యంతో మరణిస్తే వారి ప్లేసుల్లో ఇప్పటివరకు ఫిలప్ చేసే పరిస్థితి లేదని అన్నారు. మరి కొంతమంది కార్మికులు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిబీపాసరు. వీరి వల్ల ఉన్నటువంటి కార్మికులకు పని ఒత్తిడి ఎక్కువ కావడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. కావున వెంటనే ఖాళీలను పూర్తి చేయాలని కోరారు. అలాగే కార్మికులకు పనిముట్లు సరిగా ఇవ్వడం లేదని, చీపిళ్ళు మూడు నుంచి నాలుగు నెలల వరకు వస్తున్నాయని, రిక్షాలు లేవని.. గంపలు పారలు లేవని.. కొత్తవి ఇవ్వడం లేదన్నారు.పెరిగిన ధరలకు అనుగుణంగా మున్సిపల్ కార్మికులకు 26 వేల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొంత మంది కార్మికులకు ఈఎస్, పీఎఫ్ లో ఇబ్బందులు ఉన్నాయని వాటిని సక్రమంగా అమలు చేయాలని కోరారు. పాయింట్స్‌లో అవినీతికి పాల్పడుతున్న సూపర్వైజర్లపై స్వల్ప కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు జి విట్టల్,నగర కార్యదర్శి ఎం వెంకటేష్, జీహెచ్‌ఎంసీ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ నగర కార్యదర్శి జి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.