బాగా సంక్షేమంపై జిల్లా బాలల పరిరక్షణ విభాగం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ సమావేశం మంగళవారం స్థానిక బాల రక్షాబంధన్ నందు బాలల సంక్షేమం గురించి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా సంక్షేమ అధికారి ఎస్.కె రసూల్ బి డిసిపి బాసిల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. జిల్లాల్లో బాలల సంక్షేమం గురించి బాల్యవివాహాలు బాలలపై లైంగిక వేధింపులు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది గ్రామాలలో తండాలలో బాలల చట్టాలపై అవగాహన కల్పించాలని ప్రభుత్వం పరంగా ఉన్నటువంటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరడం జరిగింది మహిళలపై లైంగిక వేధింపులు నిరోధించడానికి బాలికలపై లైంగిక వేధింపులు నిరోధించడానికి అన్ని డిపార్ట్మెంట్లు కలిసికట్టుగా పని చేయాలని కోరడం జరిగింది. పోలీస్ శాఖ నుండి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని డిసిపి బాసిన్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశాన్ని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ సంపూర్ణ సభ్యులు శోభారాణి రాజేంద్రప్రసాద్ ,ఆర్ ఎం ఓ జి జి హెచ్ బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి డిసిపిఓ చైతన్య సఖి కోఆర్డినేటర్ భాను సిబ్బంది పాల్గొన్నారు.