అక్షరాస్యతను పెంపొందించుకోవాలి

నవతెలంగాణ-తాండూర్‌
గొల్ల కురుమలు అక్షరాస్యతను పెంపొందించుకొని ఆధునిక జీవన విధానాన్ని అలవరచుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. బుధవారం మండలంలోని ద్వారకాపుర్‌ గ్రామంలో బీరన్న దేవుని మేలు కొలుపు కార్యక్రమం లోభాగంగా నాగవెల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గొల్ల కురుమలు సంచార జీవన విధానాన్ని విడనాడి ఆధునిక జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. గొల్ల కురుమల సొసైటీలకు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేసి ఆదుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వాల హాయంలో గొల్ల కురుమలకు ఎలాంటి లబ్ధి చేకూరాలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గొల్ల కురుమల సంక్షేమానికి పాటుపడుతుందని తెలిపారు. వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచే విధంగా రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. గొర్రెల పెంపకం పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. గొల్ల కురుమలు సంచార జీవన విధానాన్ని విడనాడి గ్రామ పరిసరాల్లో గొర్రెల పెంపకం చేపట్టే విధంగా ఉండాలి తెలిపారు. నిరుపేదలైన గొల్ల కురుమల సొసైటీలకు ప్రభుత్వ భూమిని పంపిణీ చేసి పశుగ్రాసాన్ని పెంచుకునిలబ్ధి పొందేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందని చెప్పారు. ద్వారకాపూర్‌ గ్రామానికి 70 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యేను ద్వారకాపూర్‌ సర్పంచ్‌ మాసాడి శారద అభినందనలు తెలిపి, శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పూసాల ప్రణరు కుమార్‌ జడ్పీటీసీ బానయ్య, రైతు సమన్వయ జిల్లా సమితి సభ్యులు తిరుపతి, ఎంపీటీసీ సిరంగి శంకర్‌, కోఆప్షన్‌ సభ్యులు రహీమతుల్లా ఉప సర్పంచ్‌ శేఖర్‌, టీబీజీకేఎస్‌ నాయకులు నారాయణ, ద్వారకాపూర్‌ గ్రామ అధ్యక్షుడు ఎల్లాకుల రవికుమార్‌, సీనియర్‌ నాయకులు చంద్రగిరి శ్రీనివాస్‌, గోపాల్‌ పాల్గొన్నారు.

Spread the love