ఉద్యోగుల పేరుతో రుణాలు…

A huge scam in SBI– సూర్యాపేట ఎస్‌బిఐలో భారీ కుంభకోణం..
– రూ.4.50 కోట్లు స్వాహా చేసిన మేనేజర్‌..
– 24 మంది ఉద్యోగుల పేరుతో రుణాల మంజూరు..
– ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన..
నవ తెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
ఓ బ్యాంక్‌ మేనేజర్‌ ఉద్యోగుల పేరుతో బ్యాంకు సొమ్ముని దోచుకున్నాడు.సూర్యాపేట పట్టణంలోని నేషనల్‌ హైవే పక్కన ఉన్న ఎస్‌బిఐ బ్రాచ్‌లో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి.దీనిపై ఫిర్యాదులు రావడంతో కేసు నమోదు చేసుకున్న సూర్యాపేట పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పోలీసుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.
సూర్యపేట ఎస్ బి ఐ లో రూ 4.50 కోట్ల కుంభకోణం..
సూర్యాపేట ఎస్‌బిఐ బ్రాంచ్‌ మేనేజర్‌గా పని చేసిన మునగాల మండలానికి చెందిన షేక్‌ సైదులు ఈ కుంభకోణానికి సూత్రధారిగా ఉన్నాడు.ఇతను 2022 నుంచి 2023 వరకు ఉద్యోగంలో ఉన్నాడు. అదే సమయంలో దాదాపుగా 24 మంది లోని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగుల  పేరుతో రూ.4.50 కోట్లు రూపాయలను మంజూరు చేసి స్వాహా చేశాడు. ప్రభుత్వ శాఖలలో ఉద్యోగం చేస్తూన సిబ్బందిని బ్యాంక్‌ రుణం తీసుకునేందుకు ప్రోత్సహించి అర్హత కలిగిన వారిని ఎంచుకొని ఈ కుభకోణానికి శ్రీకారం చుట్టాడు.అంతే కాకుండా బ్యాంకు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న సిబ్బందిని అర్హత ఉన్నప్పటికీ సాంకేతిక కారణాలు చూపి,అవసరమైన పత్రాలు లేవంటూ దరఖాస్తుదారున్ని నీకు లోను రాదంటూ తిరష్కరించి.ఆపై అదే అప్లికేషన్‌ ఆధారంగా చేసుకొని, దరఖాస్తు దారుడి పేరు వివరాలతో నకిలీ పేపర్లను సృష్టించే వాడు  వాటి ఆధారంగా వారి పేర్లతో మరోసారి రుణం కోసం దరఖాస్తు చేసేవాడు. ఇలా తీసుకున్న రుణం మంజూరు చేసినట్లు బ్యాంకు రికార్డుల్లో పొందుపరచకుండా రికార్డులను లేకుండా చేసేవాడు. ఒక్కో దరఖాస్తుదారుడి పేరుతో కనీసం రూ.15 లక్షల చొప్పున కాజేశాడు. ఈ మొత్తాన్ని తమ సొంత ఖాతాల్లోకి మాలించుకున్నాడు.ఈ విషయం బాధిత ఉద్యోగులకు ముందుగానే తెలిసినట్లు సమాచారం..
కుంభకోణం ఎలా చేశారో తెలిసింది ఈ విధంగా..
ఉద్యోగుల పేరుతో బ్యాంకు లోన్ తీసుకోని తనకు సంబంధించిన ఖాతాల్లోకి మళ్ళించుకున్న బ్యాంకు మేనేజర్‌ సైదులు గత సంవత్సరం బదీలిపై హైద్రాబాద్‌లోని సీసీజి (కమర్షియల్‌ క్లయిట్‌గ్రూప్‌) మేనేజర్‌గా ట్రాన్స్ఫర్ అయినాడు. అయితే తాను తీసుకున్న ఈ రుణాలకు ప్రతి నెల ఈఎంఐలు కడుతూ వస్తున్నాడు. కానీ 2024 పిబ్రవరి నెల ఈఎంఐ చెల్లించకపోవడంతో ఉద్యోగులకు బ్యాంకు నుంచి నోటీసులు అందాయి. ఈ విధంగా అసలు నిజం తెలుసుకున్న బాధితులు సూర్యాపేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.కాగా సైదులు రామాంతపుర్‌ ఎస్‌బిఐ మేనేజర్‌తో కలిసి ఇదే తరహాలో మోసం చేసి రూ. 2.84 కోట్లు, సికింద్రాబాద్‌లో వెస్ట్‌ మారెడ్‌ పల్లి బ్రాంచ్‌ నుంచి రూ. 9.50 కోట్లు దోచుకున్నట్లు సమాచారం.
కొంతమంది ఉద్యోగులకు తెలిసే ఈ పని చేశారు..
సూర్యాపేట ఎస్‌బీఐ ( నేషనల్‌ హైవే) బ్రాంచ్‌లో ఖాతాలు ఉన్న ఉద్యోగుల పేరుతో ఆ బ్రాంచ్ మేనేజర్‌ రుణం మంజూరు చేసి తన ఖాతాల్లోకి మళ్లించి డబ్బులను నొక్కేశారు. ఇందులో పాలుపంచుకున్న పోలీస్‌శాఖలో 11 మంది ఉద్యోగులు,  వైద్యారోగ్యశాఖ కు చెందిన ఇద్దరు,విద్యాశాఖలో ఇద్దరు, ఎక్సైజ్ శాఖకు చెందిన ఇద్దరు, కలెక్టరేట్‌లో వివిద శాఖలకు చెందిన ఐదుగురు, ప్రైవేటు ఉద్యోగులు ఇద్దరూ, మొత్తం 24 మంది ఉద్యోగస్తులు ఉన్నారు.అయితే తమ పేరునా రుణాలు తీసుకున్నట్లు  కొందరు ఉద్యోగులకు ముందుగానే తెలిచినట్లు సమాచారం.మేనేజర్‌తో కుమ్మక్కై ఉద్యోగులు వారికి రావాల్సిన వాటా ముందుగానే మాట్లాడుకొని రుణం తీసుకునేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.మరి కొంత మంది ఉద్యోగులు మేనేజర్‌ మాయమాటలు నమ్మి మోసపోయినట్లు తెలుస్తోంది.

Spread the love