మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి వేడుకలు..

నవతెలంగాణ -గోవిందరావుపేట
మండలంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ  ఆశ్రమ ఉన్నత పాఠశాల (ఇంగ్లీష్ మీడియం) కర్లపల్లిలో ప్రధానోపాధ్యాయులు కల్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మహనీయులు మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్ట్రీ ల జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో పలువురు విద్యార్థులు మాట్లాడుతూ గాంధి, శాస్త్రి ని ఆదర్శంగా తీసుకుంటామని తెలిపారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు  శ్రీనివాస్  మాట్లాడుతూ గాంధీజీ ప్రపంచానికి వెలుగు అని ఆయన జీవితం,ఆచరణతో సాగేదని సత్యం, అహింస, సత్యాగ్రహం ఆయుదాలుగా మార్చి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి  చిరునవ్వుతో తన పెదల వైపు చూసేలా చేసాడని చివరికి సత్యమే గెలుస్తుందని నమ్మినవ్యక్తి గాంధి జీ ఆని అన్నారు, అదేవిధంగా లాల్ బహుదూర్ శాస్త్రి  స్వాతంత్ర్య సంగ్రామం లొనే కాకుండా స్వాతంత్ర్య భారత రెండవ ప్రధానిగా నిస్వార్థంగా పనిచేసి రైతు, జవాన్లు దేశానికి వెన్నుముకగా పనిచేస్తారని జై-జవాన్, జై-కిసాన్ అని తెలిపారని ఉన్నత పదవులు చేపట్టిన జీవిత చివరి అంకంలో  సొంత ఇల్లు కూడా లేకుండా నిస్వార్థంగా పనిచేసి దేశానికి తనసేవలను అంకితం చేసారని మహనీయుల జీవితాలు విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు కల్తి.కృష్ణ మూర్తి, ఏ. ఎన్. ఎం ఆదిలక్ష్మి, డిప్యూటీ వార్డెన్ బి.బాలు స్కూల్. కెప్టెన్. బి.అరవింద్, స్కూల్ వైస్ కెప్టెన్ ఆర్. రణదీప్, విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love