Wednesday, August 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మార్పీఎస్‌ మండల కమిటీని విజయవంతం చేయండి 

ఎమ్మార్పీఎస్‌ మండల కమిటీని విజయవంతం చేయండి 

- Advertisement -

ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మండల ఇన్చార్జి పోలేపాక ప్రవీణ్ మాదిగ 
నవతెలంగాణ-నెల్లికుదురు 

రేపు మండల కేంద్రంలో అమూల్య గార్డెన్లో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి మండల కమిటీని నిర్వహించబోతున్నామని, గ్రామాల నుండి వందలాది మంది తరలివచ్చి సమావేశాన్ని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి పోలేపాక ప్రవీణ్ మాదిగ తెలిపారు. బుధవారం మాజీ మండల అధ్యక్షుడు తుళ్ల వెంకన్న అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పోలేపాక ప్రవీణ్ మాదిగ మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్‌ మండల కమిటీకి అధిక సంఖ్యలో జనాలు హాజరై, విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జిలు ముఖ్య అతిధులుగా పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమంలో దండెంపల్లి సైదులు  మాదిగ ,హెచ్ రవి,హెచ్ అశోక్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -