మిడ్జిల్ మండలం నాయకులు
నవతెలంగాణ-మిడ్జిల్
పాలమూరు ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలనీ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు, పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి రఘునాథ్ ను మిడ్జిల్ మండల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు కోరారు. ఇందులో భాగంగా పెరుమాళ్ళ జంగయ్య, అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు బరిగల బాలయ్య, యాదవ సంఘం మండల అధ్యక్షులు బాదం శంకర్, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు శంకర్ బుధవారం రఘునాథ్ ను హైదరాబాదులో కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. పాలమూరు ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు జిల్లాతో పాటు, రంగారెడ్డి జిల్లాకు కూడా తాగు సాగునీటి సమస్య తీరుతుందని చెప్పారు. అదేవిధంగా మిడ్జిల్ మండలం నుండి చురుకైన నాయకులను జలమండలి కమిటీలోకి తీసుకోవాలని కోరినట్లు వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ జిల్లా రాజ్యంగా రక్షణ దళ్ అధ్యక్షులు కోడిగంటి నందం, పౌర హక్కుల సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఆర్ రాజా నందం తదితరులు ఉన్నారు.
పాలమూరు ప్రాజెక్టు పూర్తికి ప్రభుత్వంపై ఒత్తిడి చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



