‘మత్తడి’ పడ్డ మల్లూరువాగు ప్రాజెక్టు

– 115.250 మీటర్లకు చేరి మత్తడి
నవతెలంగాణ-మంగపేట : మండలంలోని మల్లూరువాగు(నర్సింహాసాగర్)మధ్య తరహా ప్రాజెక్టు 115.250 మీటర్ల ఇన్ ఫ్లో కు చేరి మత్తడి పడింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం నిండి 6000 క్యూసెక్కుల వరద మత్తడి పోస్తుంది. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల పారకంలో సుమారు 20 వేల ఎకరాల్లో రైతులు రెండు పంటలు పండించుకోగా మరో సంవత్సరం ఖరీఫ్ సాగుకు సైతం వరద స్టోరేజి సరిపోతుందని ఐబీ అధికారులు తెలిపారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి 8790 క్యూసెక్కుల వరద నీరు చేరగా కుడి ఎడమ కాలువల్లో ఎలాంటి లీకేజీలు లేవని నీటిపారుదల శాఖ ఏఈ వలీం మహ్మద్ తెలిపారు. మూడు రోజుల వర్షపాతం 131.4 మిల్లీమీటర్లుగా నమోదైనట్లు ఆయన పేర్కొన్నారు.

Spread the love