పిల్లలకు శాపంగా మారిన పోషకాహార లోపం

Apollo Hospital JMD Sangeetha Reddy– అపోలో అస్పత్రి జేఎండీ సంగీతా రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పిలల్లకు పోషకాహార లోపం శాపంగా మారిందని అపోలో అస్పత్రుల డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంగీతా రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఆస్కీలో ఆరోగ్య సమానత్వం..ఇండియాస్‌ మూన్స్‌ అనే అంశంపై ఏర్పాటు చేసిన డాక్టర్‌ చంద్రమౌళి మెమోరియల్‌ లెక్చర్‌ లో ఆమె కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య సమానత్వం అనేది నేడు పెద్ద సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.. ప్రపంచ వ్యాప్తంగా 50 శాతం మంది పిల్లలు పోషకాహార లోపంతో బాదపడుతున్నారని, ఇండియాలో ఈ సంఖ్య 51 శాతం ఉందని అన్నారు. స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్యం, ఆరోగ్య సంరక్షణపై దృష్టి పెట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్కీ ఇన్‌చార్జి డైరెక్టర్‌ జనరల్‌ నిర్మలా బగాచి, రిటైర్ట్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ పద్మనాభం, డాక్టర్‌ నాగభూషణం పాల్గొన్నారు.

Spread the love