తాగుడుకు బానిసై అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

నవతెలంగాణ- రామారెడ్డి
అనారోగ్యంతో పాటు, తాగుడుకు బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని రెడ్డి పేటలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన ఒగ్గు మల్లయ్య 64, గతంలో రోడ్డు ప్రమాదంలో, ప్రమాదం జరగగా అనారోగ్యానికి గురై, మద్యానికి బానిసై, జీవితంపై విరక్తి చెంది గ్రామ శివారులోని చర్చి ముందు గల చెట్టుకు నైలాన్ తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య ఒగ్గు మల్లవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Spread the love