విద్యార్థుల సేవ నిరతి అభినందనీయం క్షత్రియ కళాశాల యాజమాన్యం

నవతెలంగాణ-  ఆర్మూర్: విద్యార్థుల సేవా నిరతి అభినందనీయమని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం అల్జాపూర్ శ్రీనివాస్, అల్జాపూర్ దేవేందర్ లు అన్నారు. మండలంలోని చేపూర్ గ్రామ శివారు లో గల క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మ నీ క్యాంప్ ఎన్ లో భాగంగా బుధవారం ఎన్సిసి క్యాడెట్లు విరాళాలు జరిగిందని, ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు ఏదైనా విపత్తులో నష్టపోయిన చిన్న పిల్లల కొరకు తల్లిదండ్రులకు దూరమైన అనాధ పిల్లలకు ఎన్సిసి క్యాడెట్లు నిధిని సేకరించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే పాండే, వైస్ ప్రిన్సిపాల్ నరేందర్ ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ వెంకటేష్ తదితరులు విద్యార్థులను అభినందించారు.

Spread the love