Wednesday, August 26, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నాందేడ్‌ మాజీ ఎంపీ వసంతరావు వర్థంతిలో మండల నాయకులు

నాందేడ్‌ మాజీ ఎంపీ వసంతరావు వర్థంతిలో మండల నాయకులు

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ఎంపీగా పనిచేసి, ఆ జిల్లా ప్రజల మన్ననలు పొంది హఠాన్మరణం చెందిన ఎంపీ వసంతరావు రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని నాందేడ్ జిల్లాలోని నాయగావ్ పట్టణంలో బుధవారం పెద్దఎత్తున నిర్వహించారు. కార్యక్రమానికి మద్నూర్ మండలంలోని చిన్న షాక్కర్గా గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాండురంగ పాటిల్ హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాండురంగ పాటిల్ మాట్లాడుతూ.. నాందేడ్ ఎంపీగా వసంతరావు అందించిన సేవలు ఆ జిల్లా ప్రజలు మరువలేనివని కొనియాడారు. భారీ ఎత్తున తరలివచ్చిన జనసంద్రమే ఆయన సేవలకు నిదర్శనం అన్నారు. మహారాష్ట్ర నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఆయన అభిమానులు రావడంతో నాయగావ్‌ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -