
నవతెలంగాణ- డిచ్ పల్లి: నిజామాబాద్ రూరల్ నీయోజకవర్గం లోని పలు మండలాల్లో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి అధ్వర్యంలో సోమవారం పలువురు చేరారు. ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ అరపల్లి దశరథ్ ఆధ్వర్యంలో 150 మంది పైగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే అభ్యర్థి భూపతిరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారందరికి కాంగ్రెస్ పార్టీ కండువా వేసి సాధారణంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో జోగు సతీష్, గంగాధర్ గౌడ్, తాడేప్ గంగాధర్, తోపాటు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్, కంచేట్టి గంగాధర్, డిసిసి డెలిగేట్ సుధాకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, ఎన్ డిసిసిబి డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్, మోతిలాల్, గట్టు కడారి, ముడిగామా శీను, నారాయణ, శ్రీనివాస్, అంబర్ సింగ్, సాయందర్, తోట రాజన్న తో పాటు తదితరులు పాల్గొన్నారు.