ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ అగ్నిప్రమాదం వల్ల పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు

నవతెలంగాణ – హైదరాబాద్‌: హౌరా నుంచి సికింద్రాబాద్‌కు వస్తున్న ఫలక్‌నుమాఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ రోజు అగ్నిప్రమాదానికి గురికావడంతో దక్షిణ మధ్య రైల్వే అధికారులు రెండు రైళ్లను రద్దు చేశారు. మరో నాలుగు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్‌-రేపల్లె, సికింద్రాబాద్‌-మన్మాడ్‌ రైళ్లను రద్దు చేసినట్లు వివరించారు. సికింద్రాబాద్‌ – తిరువనంతపురం శబరి ఎక్స్‌ప్రెస్‌(వయా కాజీపేట, విజయవాడ), సికింద్రాబాద్‌-హౌరా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌ (వయా కాజీపేట, విజయవాడ) గుంటూరు వెళ్లే రైళ్లు కాజీపేట మీదుగా మళ్లించారు. యాదాద్రి భువనగిరి జిల్లాజిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య శుక్రవారం ఉదయం 11 గంటలకు బెంగాల్‌ నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోని ఒక బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ప్రయాణికులు చైన్‌ లాగడంతో పైలట్‌ వెంటనే రైలును నిలిపివేశారు.

Spread the love