తెలంగాణలో రేపటి నుంచి వర్షాలు

నవతెలంగాణ – హైదరాబాద్
ఎండలు, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాష్ట్రంలో సోమవారం నుంచి ఆరు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక కూడా జారీ చేసింది. బుధ, గురు, శుక్రవారాల్లో 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురవొచ్చని తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో ఎండలు విపరీతంగా పెరిగాయి. శనివారం అత్యధికంగా హుజూర్ నగర్ లో 46.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చాలా జిల్లాల్లో 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.

Spread the love