ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్‌లో భారీ అగ్నిప్ర‌మాదం

నవతెలంగాణ ఖ‌మ్మం: ఖ‌మ్మం ప‌త్తి మార్కెట్‌లో శ‌నివారం మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. ప‌త్తి బ‌స్తాల‌కు మంట‌లు అంటుకొని  ఒక్కసారిగా మంట‌లు ఎగిసిప‌డ్డాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేస్తోంది. ఈ ప్ర‌మాదంలో 2200 పత్తి బ‌స్తాలు అగ్గికి ఆహుతైనట్టు తెలుస్తోంది. భారీగా ఆస్తి న‌ష్టం జ‌రిగిన‌ట్లు మార్కెట్ అధికారులు అంచ‌నా వేస్తున్నారు. మంట‌లు ఎలా అంటుకున్నాయ‌నే విష‌యంపై స్ప‌ష్ట‌త లేదు. ఒక్క షెడ్డులో ఉన్న ప‌త్తి బ‌స్తాల‌న్నీ కాలి బూడిద‌య్యాయి. అయితే ఈ బ‌స్తాలు రైతుల‌కు సంబంధించిన‌వా..? లేక వ్యాపారుల‌కు సంబంధించిన‌వా..? అనే విష‌యం ఇంకా స్ప‌ష్టత రావాల్సి ఉంది.

Spread the love