ఖమ్మం జిల్లాలో విషాదం..

నవతెలంగాణ-ఖమ్మం: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం పాతకారాయిగూడెంలో విషాదం చోటుచేసుకున్నది. పాతకారాయిగూడెంలోని మామిడి తోటలో ఉన్న ఓ చెట్టుకు ఉరివేసుకుని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. కుమార్తెతో సహా తల్లిదండ్రులు బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను కృష్ణయ్య, సుహాసిని వారి కుమార్తె అమృతగా గుర్తించారు. సుహాసిని గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నదని, దీంతో మనస్తాపం చెంది కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love