నవతెలంగాణ – భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా పరిధిలోని చర్ల మండలం దేవనగరంలో ముగ్గురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన కొరియర్ల వివరాలను జిల్లా ఎస్పీ జి వినీత్ వెల్లడించారు. ముగ్గురు కొరియర్ల నుంచి జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రిక్ వైర్, డిటోనేటర్లు, డ్రోన్, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నాలుగు రోజుల క్రితం ములుగు జిల్లాలో ఇద్దరు మావోయిస్టు కొరియర్లు పోలీసులకు పట్టుబడిన విషయం విదితమే. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం పూజారి కాంకేర్ గ్రామం ఊసూరు బ్లాక్‌కు చెందిన మడిని దేవ దేవయ్య, కిక్కిడి హు అలియాస్ రా అలియాస్ ఊరడు అలియాస్ మండకంను అరెస్టు చేసినట్లు ములుగు ఎస్పీ గౌస్ ఆలం తెలిపారు. వీరు వెంకటాపురం(నూగూరు) మండలం చెలిమలలో పేలుడు పదార్థాలను అమర్చుతున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు పేరూరు ఎస్సై సిబ్బందితో అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు.