మార్కెట్ కమిటీ కామారెడ్డి సాధారణ సమావేశం..

Market Committee Kamareddy General Meeting..నవతెలంగాణ –  కామారెడ్డి
కామారెడ్డి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కామారెడ్డి కార్యాలయంలో శుక్రవారం తొలిసారి సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతనంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా ఎన్నికైన లక్ష్మిని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి సన్మానించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ కామారెడ్డి నూతనంగా పాలకవర్గం ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వమునకు  కృతజ్ఞతలు తెలియపర్చుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం మార్కెట్ యార్డ్ యందు పలు అభివృద్ధి పనులు చేపట్టుట కొరకు తగు ప్రతిపాదాలనలను ప్రభుత్వమునకు పంపుటకు  మార్కెట్  తగు ఆదాయమును సమకూర్చుటకు తగిన చర్యలు తీసుకునుటకు పాలకవర్గం  చర్చించారు. ఈ కార్యక్రమంలో  చైర్పర్సన్ ధర్మగోని లక్ష్మి,  వైస్ చైర్పర్సన్  మీనుకురి బ్రహ్మానందరెడ్డి, కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ,  సభ్యులు, కార్యదర్శి నర్సింలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Spread the love