భారతీయ వైద్యానికి ప్రాణం పోస్తున్న మాస్టర్‌ ఇ.కె.మిషన్‌

సింగరేణి డైరెక్టర్‌ (పా) ఎన్‌.బలరామ్‌
నవతెలంగాణ-కొత్తగూడెం
సమాజశ్రేయస్సు కోరి మాస్టర్‌ పీకే మిషన్‌ భారతీయ వైద్యానికి ప్రాణం పోస్తుందని సింగరేణి సంస్థ డైరెక్టర్‌ (పా) ఎన్‌.బలరాం అన్నారు. శుక్రవారం రైటర్‌ బస్తీలో మాస్టర్‌ ఈకే ఆధ్యాత్మిక హౌమియో సేవా సంస్థకు కేటాయించిన స్థలంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలను నాటి పనులు ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో డైరెక్టర్‌ బలరామ్‌ మాట్లాడుతూ భారతీయ వైద్య విధానమైన ఆయుష్‌ శాఖలో భాగంగా హౌమియో సేవలను అందిస్తూ భారతీయ వైద్య విధానానికి ప్రాణం పోస్తున్న మాస్టర్‌ ఇ.కె.మిషన్‌ సేవలు అభినందనీయమన్నారు. మాస్టర్‌ ఇ.కె ఆధ్యాత్మిక హౌమియో సర్వీస్‌ మిషన్‌ సింగరేణి సంస్థ సహాయ సహకారాలతో గత మూడు దశాబ్దాలుగా 30 వేల మందికి నిరంతరంగా వైద్య సేవలు అందిస్తుండటం మా సంస్థకు గర్వకారణం అన్నారు. మాస్టర్‌ ఇకె.సంస్థ గత 60 సంవత్సరాలుగా, ప్రపంచంలో 200 బ్రాంచీలు కలిగి ఉండడం భారతీయులుగా మనం గర్వించదగ్గ విషయం అన్నారు. ఒక మంచి ఆరోగ్య కార్యక్రమంలో నిత్యం ఉచిత సేవలు అందిస్తున్న వారందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కొత్తగూడెం నిర్వాహకులు ఏ.ఎస్‌.జి గోపాలరావు, రాజేంద్రప్రసాద్‌, ఆవుల శ్రీకాంత్‌, డాక్టర్‌ బత్తుల కృష్ణయ్య, కొత్తగూడెం మున్సిపల్‌ గ్రీన్‌ అంబాసిడర్‌ మొక్కల వెంకటయ్య, మొక్కల రాజశేఖర్‌, సుబ్బారావు, పద్మిని, లత, శిరీష, శ్రీనివాసరెడ్డి, లక్ష్మి, కోటేశ్వరరావు, కృష్ణారావు, దుర్గ, నాగేశ్వరరావు, సుబ్రహ్మణ్యం, సుగుణ రావు, తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love