మే డే పోస్టర్ ఆవిష్కరణ..

నవతెలంగాణ – డిచ్ పల్లి

ఇందల్ వాయి మండలంలోని గన్నారం గ్రామంలో మంగళవారం మే డే పోస్టర్ ను ఐఎఫ్టియు జిల్లా సహాయ కార్యదర్శి జేపీ గంగాధర్ , పంచాయతీ కార్మికులతో‌ కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు మేరకు 26 వేల వేతనం ఇవ్వాలని ఉన్నప్పటికీ తెలంగాణ సర్కార్  అమలు చేయడం లేదన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గడిచిన 10 ఏళ్ల నుంచి విద్యార్థులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోడీ ప్రభుత్వం మోసం చేసిందని  దుయ్యబట్టారు. దేశంలోని సంపద ఆదాని, అంబానీలకు కట్టబెట్టి దేశ ప్రజలకు చేసిందేమి లేక రాముడి పేరు తో ఓట్లు అడుగుతున్నారని,  మతాల పేరు తో దేశ ప్రజలను మానసికంగా ఒత్తిడి తీసుకొచ్చి మతం రంగు బలవంతంగా పోస్తున్నారని విమర్శించారు. నల్ల డబ్బు బయటకు తీస్తానని మొదట గెలిచినప్పుడు ప్రధాని మోడీ చెప్పడం జరిగిందని, ఒక ఇంటికి 15 లక్షల చొప్పున బ్యాంకుల్లో వేస్తానని ప్రజలను మోసం చేసిన మోడీ ఓట్లు అడిగే అర్హత లేదని భారత కార్మిక సంఘాల సమైక్య డిమాండ్ చేస్తుందని వివరించారు.మే డేను విజయవంతం చేయాలని గంగాధర్ పిలుపు నిచ్చారు. పోస్టర్ ఆవిష్కరణలో దుబ్బాక మోహన్, మల్లయ్య, లక్ష్మి ,మహేష్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love