బీఆర్ఎస్ తో పొత్తుకు మాయావతి అంగీకారం

నవతెలంగాణ – హైదరాబాద్‌: బీఆర్ఎస్ తో పొత్తుకు బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి అంగీకారం తెలిపారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ట్వీట్‌ చేశారు. బీఆర్ఎస్ తో పొత్తుపై త్వరలో కేసీఆర్‌తో తదుపరి చర్చలు ఉంటాయని ఆయన తెలిపారు. ప్ర‌స్తుతం బీఆర్ఎస్ పార్టీ దేశంలో ఏ కూట‌మిలో లేనందున‌, బీఎస్పీకి ఆ పార్టీతో పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో క‌లిసి ప‌ని చేయ‌డానికి మాయావ‌తి అంగీక‌రించార‌ని స్ప‌ష్టం చేశారు. త్వ‌ర‌లోనే బీఆర్ఎస్ – బీఎస్పీ పొత్తు విష‌యంలో తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో జ‌రిగే తదుప‌రి స‌మావేశానికి బీఎస్పీ ఎంపీ రాంజీ.. బెహ‌న్ జీ దూత‌గా హాజ‌రు కానున్నట్లు ఆర్ఎస్పీ పేర్కొన్నారు.

Spread the love