
కార్మికుల హక్కుల కోసం పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగఫలితమే “మేడే” అని టీఎస్ యుఈఈయు గజ్వేల్ డివిజన్ సహాయ కార్యదర్శి, మండల నాయకుడు సిరినేని భూపతి రాజు అన్నారు. బుధవారం ప్రపంచ కార్మిక దినోత్స వం సందర్భంగా తొగుట సెక్షన్ తుక్కాపూర్ సబ్ స్టేషన్ లో తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయి యూనియన్ (సిఐటియు అనుబంధ సంఘం) ఆధ్వర్యంలో జండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివిధ రంగాల లో పనుపలు చేస్తున్న కార్మికుల హక్కుల పండుగ మేడే అన్నారు. కార్మికుల శ్రమ దోపిడీని అరికట్టేం దుకు, ప్రపంచ శ్రామికుల ను ఏకం చేసిన రోజు మేడే అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్య క్రమంలో తొగుట మండల ఉపాధ్యక్షుడు భోగా గణేష్, సెక్షన్ నాయకులు రాగుల లక్ష్మణ్, మల్లి కార్జున్, శ్రీకాంత్, రాజేందర్ రెడ్డి, రాకేష్ ,రవీందర్, నరసింహారెడ్డి, అధికం సాయికుమార్ గౌడ్, తది తరులు పాల్గొన్నారు.